Home » పీఎస్- 2 లో జూనియ‌ర్ ఐశ్వ‌ర్య గా న‌టించిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా..? ఇప్పుడు ఫుల్ బిజీ..!

పీఎస్- 2 లో జూనియ‌ర్ ఐశ్వ‌ర్య గా న‌టించిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా..? ఇప్పుడు ఫుల్ బిజీ..!

by AJAY
Ad

ద‌ర్శ‌కుడుకు మ‌ణిరత్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ కు సీక్వెల్ పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. పీఎస్ 1 కు నెగిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ పీఎస్ 2 ను తెర‌కెక్కించారు. అయితే పీఎ 1 కంటే పీఎస్ 2 కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ షాట్ లో కనిపించిన అమ్మాయిని ఎవరూ మర్చిపోలేరు. స్నానం కోసం నదిలోకి టీనేజ్ అమ్మాయి దిగి తల వరకు నదిలో మునిగి ఆ తర్వాత పైకి లేస్తుంది.

Advertisement

ఫ‌స్ట్ షాట్ లో కనిపించిన అమ్మాయి తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ తర్వాత నందిని హీరోయిన్ ఐశ్వర్య గా మారుతుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నందిని పాత్రతోనే మొదలవుతుంది. ఇక ఆ అమ్మాయి ఎవరా..? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు సారా అర్జున్. 2011లో సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల‌లో నటించింది.

Advertisement

అంతే కాకుండా తెలుగులో 2015లో దాగుడుమూతల దండాకోర్ అనే సినిమాలో సైతం నటించింది. ఇక సారా అర్జున్ తండ్రి పేరు రాజ్ అర్జున్. ఆయన కూడా పల సినిమాలు వెబ్ సిరీస్ ల‌లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నాడు. రాజా అర్జున్ కుమార్తెగా సారా సినిమాల‌లోకి ఎంట్రీ వచ్చింది. పిఎస్ 1 లోనే సారా అర్జున్ కనిపించినప్పటికీ ఆమె పాత్ర‌కు పీఎస్ 2 లో ప్రాధాన్యత‌ దక్కింది. ఇక సారా అర్జున్ అందాన్ని చూసిన ప్రేక్షకులు ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని ప్రేక్ష‌కులు జోష్యం చెబుతున్నారు.

ALSO READ :ఏన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చారు….హీరో త‌రుణ్ త‌ల్లి కామెంట్స్ వైర‌ల్..?

Visitors Are Also Reading