హైదరాబాద్ రహదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఘోర ప్రమాదాల తరువాత ఇష్టం వచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుని తిరిగే వారిపై చర్యలు చేపట్టారు. వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెస్, అడ్వకేట్ల పేరుతో స్టిక్కర్లు అంటించిన వారు తప్పనిసరిగా సరైన గుర్తింపు కార్డులను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. లేదంటే సంబంధిత వెహికల్ని సీజ్ చేస్తామన్నారు.
కారులో ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు. కారు యజమాని ఆర్సీ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, బ్లాక్ స్టిక్కరింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. కారు ప్రమాదానికి గురైతే అందులో ఎవరెవరు ఉన్నారు..? వారి వివరాలు లభించక ట్రాఫిక్ పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేసు విచారణ ఆలస్యం అవుతోంది. ఈ తరుణంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
Advertisement
Advertisement
డూప్లికేట్ స్టిక్కర్లు అంటించుకుని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ కంపెనీలు, వ్యక్తుల పేర్లను విచ్ఛలవిడిగా వాడే వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇలాంటి తనిఖీల వల్ల ప్రమాదాలు నివారించవచ్చు అని, దుర్వినియోగం అరికట్టవచ్చని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాదు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా తిరిగే వారిని కూడా నియంత్రించవచ్చు అని పేర్కొన్నారు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి