మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన సొంత టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందరు హీరోలు డ్యాన్స్ లు ఫైట్ లు చేస్తుంటారు. కానీ చిరంజీవి తన డ్యాన్స్ లో అయినా ఫైట్స్ లో అయినా ప్రత్యేక మ్యానరిజం ఉండాలనుకున్నారు. మైకేల్ జాక్సన్ వీడియోలు చూసి సొంతంగా డ్యాన్స్ నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోల తరవాత అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు.
Advertisement
తన తరం హీరోలతో పోటీ పడిస్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత మళ్లీ అలాంటి నటుడు రాలేదు. అదే సమయంలో చిరంజీవి ఒకే ఒక్క హిట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. దర్శకులను తనవైపు తిప్పుకున్నారు. ఖైదీ సినిమా తరవాత చిరంజీవి దశ మారిపోయింది. వరుస హిట్లను అందుకుని స్టార్ హీరోగా మారిపోయారు. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు.
ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా చిరంజీవి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి అంటే గిట్టని వాళ్లు ఈ పని చేశారు. చంటబ్బాయి, కొండవీటిరాజా, కిరాతకుడు, విజేత ఇలా వరుస హిట్లు అందుకున్న చిరును చూసి కొంతమంది ఓర్చుకోలేకపోయారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవిపై అప్పట్లో విషప్రయోగం కూడా జరిగింది.
Advertisement
నిజానికి చిరంజీవి బయట ఫుడ్ తినాలంటేనే బయపడేవారు. షూటింగ్ సమయంలో ఎదైనా ఇబ్బంది వస్తే మళ్లీ షూటింగ్ కు అంతరాయం కలుగుతుందని భావించేవారు. అయితే చిరంజీవి హీరోగా మద్రాస్ లో మరణమృదంగం అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో చాలా మంది ఫ్యాన్స్ గేటు వద్ద ఉండటంతో వారిని వెళ్లి కలిసారు. అప్పుడే ఓ అభిమాని చిరంజీవి కాళ్లపై పడ్డారు.
ఈ రోజు నా బర్త్ డే అని చెప్పి చిరు ముందు కేక్ కట్ చేశారు. అంతే కాకుండా కేక్ ను తినాలని చిరును కోరాడు. కానీ ఆయన షూటింగ్ లో ఉన్నాను తినలేను అని చెప్పారు. దాంతో అభిమాని కేక్ తీసుకుని చిరంజీవి నోట్లో కుక్కాడు. ఆ తోపులాటలో కేక్ కిందపడిపోయింది. ఇక ఆ కేక్ లో మెగాస్టార్ రంగు రంగుల పదార్థాలను గుర్తించాడు.
Also Read: విడుదలైన ‘గాలివాన’ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
వెంటనే కేక్ ఉమ్మేసి నోరు కడుకున్నాడు. షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. కానీ చిరంజీవి నాలుక నీలి రంగులోకి మారిపోయింది. అది గమనించిన మేకప్ మేన్ వెంటనే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పారు. దాంతో చిరును ఆస్పత్రికి తరలించగా విషప్రయోగం జరిగిందన్నారు. వాంతి అయ్యేలా చికిత్స చేశారు. మరుసటి రోజు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.
Read Also: ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే కలిగే ప్రయోజనాలు…తెలిస్తే ఒప్పుకోవాల్సిందే…!