Home » విడుద‌లైన ‘గాలివాన’ ట్రైల‌ర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

విడుద‌లైన ‘గాలివాన’ ట్రైల‌ర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

పాన్ ఇండియా చిత్రాల‌తో థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌చ్చింది. ఓ వైపు ఓటీటీలు కూడా స‌స్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌, సూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాయి. ప్రేక్ష‌కుల‌ను అంతులేని వినోదాన్ని అందించేందుకు ఓటీటీలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వెబ్ సిరీస్‌ల‌ను రూపొందిస్తున్నాయి. ఈ త‌రుణంలో తాజాగా ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో మ‌రో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజ‌ర్‌, లూజ‌ర్ 2 వంటి టాప్ నాచ్ సిరిస్ నిర్మించిన పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి యూరోపియ‌న్ డ్రామాను తెలుగు మార్పులు చేసి జీ5 వారు గాలివాన అనే ఒరిజిన‌ల్ సిరీస్‌గా నిర్మిస్తున్నారు. బీబీసీ స్టూడియోస్ నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ భాగ‌స్వామ్యంతో బీబీసీ స్టూడియోస్ సంయుక్తంగా వెబ్ సిరీస్‌ను నిర్మించారు.


ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో గాలివాన వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానున్న‌ది. ఈ త‌రుణంలో మార్చి 31న కింగ్ అక్కినేని నాగార్జున ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ వీక్ష‌కుల‌ను న‌రాలు తెగే ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు స‌స్పెన‌స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా సాగే ఈ ట్రైల‌ర్‌లో రాధిక సెంటిమెంట్ డైలాగ్స్‌ ఆక‌ట్టుకుంటున్నాయి. క్వాలిటీ ప‌రంగా, విజువ‌ల్స్ ప‌రంగా భారీత‌నం కొట్టొచ్చినట్టు క‌న‌ప‌డుతోంది.

Advertisement

Advertisement

గ‌తంలోకొన్ని క్రైమ్ థ్రిల్ల‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నప్ప‌టికీ ఇందులో మాత్రం మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో కూడిన క్రైమ్ థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్ష‌కుల‌ను ఎమోష‌న‌ల్ క్యారీ చేసేలా ఉండ‌డం విశేషంగా చెప్పుకోవాలి. సాయికుమార్ పాత్ర కూడా ఎమోష‌న్‌తో పాటు ఫ్యామిలీ బాండిర‌గ్‌కు ఉన్న విలువ‌ను చూపిస్తోంది. ఈవెబ్ సిరీస్‌ను వీక్ష‌కుల కోసం ఏప్రిల్ 14న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌లో సాయికుమార్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తుండ‌గా.. చాందిన చౌద‌రి, చైత‌న్య‌కృష్ణ‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌, అశ్రిత, అర్మాన్‌, నందినిరాయ్, తాగుబోతు ర‌మేష్ కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

Visitors Are Also Reading