Home » ప్లీజ్ సార్ నన్ను పాస్ చేయండి.. లేదంటే మా పేరెంట్స్ పెళ్లి చేస్తారు.. బోర్డు పరీక్ష పేపర్ లో విద్యార్థిని రాసిన తీరు..?

ప్లీజ్ సార్ నన్ను పాస్ చేయండి.. లేదంటే మా పేరెంట్స్ పెళ్లి చేస్తారు.. బోర్డు పరీక్ష పేపర్ లో విద్యార్థిని రాసిన తీరు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అప్పుడప్పుడు విద్యార్థులు పరీక్షా పత్రాలలో వింత వింత సమాధానాలు రాస్తూ నవ్విస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమాల గురించి రాస్తుంటారు. ఈ విధంగా విద్యార్థుల ధోరణి అనేది రాను రాను డిఫరెంట్ గా తయారవుతుంది. దీనికి ప్రధాన కారణం ఇంట్లో తల్లిదండ్రులే. అయితే కొంతమంది ఏమిరాక కామెడీగా రాస్తారు. కానీ కొంతమంది తమ ఇబ్బందులను ఎక్కడ చెప్పుకోలేక ఈ విధంగా పరీక్షా పత్రాల్లో రాస్తున్నారు. ఆ కోవకే చెందింది ఈ విద్యార్థిని. పరీక్ష పత్రంలో రాసిన తీరు అందరిని ఆలోచించేలా చేస్తోంది.

రాను రాను విద్యార్థుల్లో ఇలాంటి మార్పు రావడానికి ప్రధాన కారణం వారి తల్లిదండ్రులు, ఇంట్లో ఒత్తిడులు అని చెప్పవచ్చు. దీంతో విద్యార్థులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు అయితే పరీక్షల్లో పాస్ అయిన, ర్యాంకు రాకపోయినా, ఒకవేళ ఫెయిల్ అయిన తల్లిదండ్రులు ఏమైనా అంటారు అనే భయంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తున్నారు. తమ సమస్యని తల్లిదండ్రులకు చెప్పుకోలేక బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ద్వారా వారికి వెళ్లబోసుకున్నారు. తమని పాస్ చేయాలని కోరుతూ జవాబు పత్రాలపై రాస్తూ కొంతమంది విద్యార్థులు వింత ధోరణి కనబరుస్తున్నారు.

Advertisement

Advertisement

ప్లీజ్ మాకు ఎలాగైనా పాస్ మార్కులు వేయాలని కొందరు అడిగితే, పాస్ మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు బెదిరిస్తున్నారు. అయితే ఈ ఘటన హర్యానా రాష్ట్రం లోని పదవ తరగతి బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో చోటుచేసుకున్నది. ఒక విద్యార్థిని ” ప్లీజ్ నన్ను పాస్ చేయండి సార్ ” లేదంటే మా నాన్న వివాహం చేస్తాడు “.. తమ గోడును వెలిబుచ్చారు స్టూడెంట్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;

మీ భార్య ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త మీకు కూడా ఇలానే జరగవచ్చు..?

హార్దిక్ పాండ్య డ్రీమ్ ఐపీఎల్ కాదంట.. ఏంటో తెలుసా మరి..?

 

 

Visitors Are Also Reading