Home » హార్దిక్ పాండ్య డ్రీమ్ ఐపీఎల్ కాదంట.. ఏంటో తెలుసా మరి..?

హార్దిక్ పాండ్య డ్రీమ్ ఐపీఎల్ కాదంట.. ఏంటో తెలుసా మరి..?

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ లోకి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది గుజరాత్ టైటాన్స్. గత రెండేళ్లుగా సరైన ఫిట్నెస్ లేక టీం ఇండియాలో చోటు కోల్పోయిన హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించుకుంది. దాంతో ఈ ఏడాది ఆ జట్టుదే ఆఖరి స్థానం అని చాల మంది చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ జట్టే టైటిల్ ఎగురేసుకుపోయింది. అయితే గుజరాత్ టైటిల్ గెలవడంలో ఆ జట్టు కెప్టెన్ హెదిక్ పాండ్య ముఖ్య పాత్ర పోషించాడు. కానీ తన డ్రీమ్ అయితే ఐపీఎల్ కాదు అని హార్దిక్ అంటున్నాడు.

Advertisement

ఐపీఎల్ ఫైనల్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన పాండ్య… ఐపీఎల్ టైటిల్ సాధించాం. కానీ నా డ్రీమ్ మాత్రం ఇండియా ప్రపంచ గెలవడమే అని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచ కప్ కానీ.. లేక టీ20 ప్రపంచ కప్ కానీ ఏదైనా సరే భారత జట్టు గెలవాలి. ఆ విజయంలో నా వంతు పాత్ర నేను పోషించాలి అనేదే నా డ్రీమ్. అయితే మేము ప్రపంచ కప్ లో గెలవడానికి నేను ఎంత చేయగలనో.. అంతకంటే ఎక్కువనే చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు సొంత లాభాల కోసం కాకుండా జట్టు కోసం ఆడే మనిషిని.

Advertisement

నా తపన మొత్తం ఒక్కటే జట్టుకు నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి. భారత జట్టుకు ఇప్పటికే నేను చాల మ్యాచ్ లు ఆడాను. ఐన కూడా ప్రతి మ్యాచ్ నాకో కొత్త అనుభూతే. దేశం కోసం ఆడటం కంటే ఎక్కువ ఏమి ఉండదు. అందుకే దేశానికి ప్రపంచ కప్ తేవాలి అనేదే నా డ్రీమ్. అందుకోసం నేను ఎంత దూరమైన వెళ్తాను అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఐపీఎల్ లో కెప్టెన్ గానే కాకుండా బ్యాట్ తో కూడా బాగానే రాణించాడు. మొత్తం ఆడిన 15మ్యాచ్‌లలో 487 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే ఫైనల్స్ లో 3 వికెట్లు తీసిన పాండ్య మొత్తం సీజన్ లో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి ఇదే మంచి సమయం.. ఆ పని చేయడానికి..!

ఐపీఎల్ 2023 దద్ధరిల్లిపోతుంది అంటున్న రోహిత్ శర్మ..!

Visitors Are Also Reading