Home » విమానాల్లో బాత్రూంలను ఆకాశంలో శుభ్రపరిచి, ఖాళీ చేస్తారు.. మరి ఆ వ్యర్థాలు ఎక్కడ వేస్తారు..!!

విమానాల్లో బాత్రూంలను ఆకాశంలో శుభ్రపరిచి, ఖాళీ చేస్తారు.. మరి ఆ వ్యర్థాలు ఎక్కడ వేస్తారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం మన ఇళ్లలో ఉపయోగించేటటువంటి టాయిలెట్ లకు చాలా భిన్నంగా విమానంలో టాయిలెట్లు ఉంటాయి. వీటిలో టాయిలెట్స్ వ్యాక్యూమ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ సిస్టం ద్వారా వ్యర్థాలను వ్యాక్యూమ్ లాగేసుకుని వ్యర్థాలు ట్యాంకులకు పంపిస్తుంది. విమానం ల్యాండ్ అయ్యాక ట్యాంక్ ను శుభ్రపరుస్తారు. అయితే మనం సాధారణంగా టాయిలెట్ శుభ్రపరచడానికి ఎక్కువ నీటిని ఉపయోగిస్తాం. అలాగే విమానంలో కూడా ఎక్కువ నీటిని ఉపయోగిస్తే బరువు పెరిగి ఇంధన వ్యయం కూడా పెరుగుతుంది.

Advertisement

దీనికి బదులు గానే వ్యాక్యూమ్ సిస్టంని ఉపయోగిస్తారు. అక్కడ వచ్చే నీటిలో నీలి రంగులో ఉన్న లిక్విడ్ ని కలుపుతారు. మనం ప్లష్ బటన్ నొక్కగానే ఆ నీరు టాయిలెట్లను శుభ్రపరుస్తుంది. దీంతో వ్యాక్యూమ్ సిస్టం ఆ వ్యర్ధాలతో ఉన్న నీటిని మొత్తం లాగేసుకుంటుంది. ఒకవేళ ఈ సిస్టం కి బదులు నీటిని ఉపయోగిస్తే మాత్రం అది వ్యర్థాల ట్యాంకు లోకి వెళ్లి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల సమస్య వస్తుంది అంటే విమానం టేకాఫ్ ల్యాండింగ్ టైం లో ఎక్కువ ఆక్సిలేరేషన్, డిసలరేషన్ ఒత్తిడి వల్ల ట్యాంకులో ఎక్కువ ఒత్తిడి జరిగి జాయింట్ల వద్ద వ్యర్థాలు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.దీని కోసమే ఈ వ్యాక్యూమ్ వాడతారు. దీని వల్ల నీరు కూడా తక్కువగా అవసరం పడుతుంది. దీంతో టాయిలెట్ శుభ్రంగా ఉండటమే కాకుండా, లీక్ అయ్యే అవకాశం ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యర్థాలు లిక్ అవుతాయి. విమానాలు చాలా ఎత్తులో వెళ్తున్నప్పుడు ఉష్ణం తగ్గిపోయి వ్యర్థాలు గడ్డ కడతాయి. తిరిగి విమానం మళ్లీ ల్యాండ్ అవుతున్న టైంలో ఉష్ణం పెరిగి ద్రవ రూపంలోకి మార్పు చెందుతుంది. అప్పుడప్పుడు ల్యాండింగ్ జనావాసాల మీద కూడా జరుగుతుంది. ఒకవేళ ఈ సమయంలో లీకేజీ ఏర్పడితే వ్యర్థాలు ఇండ్ల మీద పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకనిపిస్తుంది ఆకాశంలో ఎగిరే విమానాలు శుభ్రంచేసి వ్యర్థాలను ఏం చేస్తారో అని..?

Advertisement

ALSO READ :

ఆస్ట్రేలియా అమ్మాయి..బీహార్ అబ్బాయి….ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్టులో….!

ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు బాత్రూంలు కడిగేదట..!

 

Visitors Are Also Reading