పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించినున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై టీజర్ విడుదల వరకు ఎలాంటి వార్తలు రాలేవు. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఈ సినిమా గురించి ఓ రేంజ్ లో చర్చ జరిగింది. టీజర్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు ఆరోపించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉంటే, తాజాగా ఆది పురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆది పురుష్ కు సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి సమాధానం కోరింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆది పురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.
సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు ఆది పురుష్ సినిమా టీజర్ ను విడుదల చేశారనేది పిటిషన్ దారుని వాదన. అంతేకాకుండా సీత పాత్రలో నటించిన కృతి సనన్ కాస్ట్యూమ్స్ పై కూడా పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివరాలను కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. మరి కోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుందో చూడాలి.
READ ALSO : పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబు బుర్రలేని మనిషి – రోజా