తెలంగాణ ప్రజలకు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీకి సంబంధించి చేసిన వాక్యాలకు కౌంటర్ గా ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యాలు, కౌంటర్లు హద్దులు దాటుతున్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
READ ALSO : తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?
Advertisement
రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పరిధి దాటకూడదంటూ హితవు పలికారు. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వారిపై పవన్ కళ్యాణ్ ఈగ వాలనివ్వడం లేదని ఆగ్రహించారు. కొత్తగా వకీలు బాధ్యత ఈయన తీసుకున్నాడని సెటైర్ వేశారు. తెలంగాణ మంత్రులతోనూ బిఆర్ఎస్ తోను ఈ కొత్త బంధం ఏంటని ప్రశ్నించారు.
Advertisement
READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !
పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏమన్నాడో అసలు పవన్ విన్నాడా? అని పేర్ని నాని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు రాష్ట్రాన్ని తిడితే అది వేరే ఇది అంటూ వెనకేసుకు రావడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి తరఫున వకల్తా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ కిరాయి మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పిన తర్వాత ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
READ ALSO : కోహ్లీకి దెబ్బ మీద దెబ్బ! భారీ షాక్ ఇచ్చిన BCCI