సాధారణంగా జామ పండు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. గ్రామాల్లో అయితే ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. ఈ జామపండ్లు చాలా ఫ్రెష్ గా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. అయితే ఈ జామపండ్లలో రకరకాలు ఉన్నాయి. కొన్ని గులాబీ గుజ్జు కలిగినవి, మరికొన్ని తెలుపు గుజ్జు కలిగినవి.. ఈ కలర్ వేరైనా పండులోని గుణాలు మాత్రం ఒకటే. ఇందులో మానవ శరీరానికి మేలు చేసే విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ప్రోటీన్, ఇవే కాకుండా బీటాకెరోటిన్ కలిగి ఉంటాయి.. ఇన్ని పోషక పదార్థాలు ఉన్న జామ పండు.. తింటే మేలు అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సమస్యలు ఉన్న వారు మాత్రం జామపండు జోలికి కూడా పోకూడదు.. వారెవరో ఇప్పుడు చూద్దాం..
1.జలుబు దగ్గు:
అత్యధికంగా జలుబు, దగ్గు ఉన్నవారు జామ పండ్లు తినకూడదు.. ఇది తినడం వల్ల వారికి జలుబు ఎక్కువైపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
Advertisement
also read:అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే 5 లక్షణాలు ఇవేనట….? 3 వది ఇంపార్టెంట్…!
2.బవెల్ సిండ్రోమ్ సమస్యలు ఉన్నవారు:
Advertisement
జామ పండులో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తొలగించడానికీ కాకుండా పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని అంటున్నారు.. ముఖ్యంగా ప్రేగుల సిండ్రోమ్ తో బాధపడుతున్నవారు జామపండ్లు ముట్టుకోరాదు.
3.డయాబెటిక్ రోగులు :
డయాబెటిక్ పేషెంట్స్ జామ పండు జోలికి పోకూడదు.. ఒకవేళ తినాలి అనిపిస్తే పరిమిత స్థాయిలో మాత్రమే తినాలి. అది కూడా గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకుంటూ తింటే మంచిదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.
4.రోజులో ఎన్ని జామపళ్ళు తినాలి:
సాధారణంగా ఒక రోజులో ఒకటి రెండు జామ పండ్లు తినడం వలన ఆరోగ్యానికి మంచిదే కానీ, ఈ జామ పండు భోజనం చేసే మధ్యలో తినాలి. అలాగే వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
also read: