ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కొత మంది కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకోకూడని వాటిలో వేరు శనగ ఒకటి. వేరు శనగ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మాంస తులు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ సమస్యలు ఉన్న వారు వేరు శనగకు దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు నిపుణులు. పచ్చి వేరు శనగను ఖాలీ కడుపుతో తినడం ద్వారా జీర్ణ సమస్యలను నివారించవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.
Advertisement
ముఖ్యగా చలి కాలంలో మీ రోజు వారి ఆహారంలో వేరు శనగలను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. డయాబెటిక్ రోగులకు వేరు శనగ చాలా మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గతాయి. ఔషద గుణాలు పుష్కలంగా ఉన్న వేరు శనగను తీసుకోవడం వల్ల కొందరి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని వ్యాధులు ఉన్న వారు వేరు శనగను తీసుకుంటే.. అది శరీరానికి ప్రమాదాన్ని పెంచుతుంది. ఏయే మూడు జబ్బుల్లో గింజలు తింటే ఆరోగ్యానికి హానీ కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : మీ దంతాలలో రక్తం కనిపిస్తుందా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే జాగ్రత్త..!
వేరు శనగను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల పెరుగుతాయి. అదేవిధంగా జలుబు పెరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులను ఎక్కువ చేస్తాయట. శీతాకాలంలో కీళ్ల నొప్పులతో బాధపడితే వేరు శనగ అస్సలు తినకండి. బీపీ ఉన్న వారు కూడా వేరు శనగకు చాలా దూరంగా ఉండాలి. అదేవిధగా కాలేయ సమస్య ఉన్న వారు కూడా వేరు శనగను తీసుకోకూడదు. కాలేయ సమస్య ఉన్న వారు వేరు శనగను తీసుకోవడం వల్ల అప్లాటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. అప్లాటాక్సిన్ అనేది కాలేయాన్ని దెబ్బతీసే హానికరమైన పదార్థం. కాబట్టి ఇలాంటి సమస్యలున్న వారు వేరు శనగకు దూరంగా ఉంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : మధ్యాహ్నం భోజనం తరువాత మీకు నిద్ర వస్తుందా ? అయితే ఇలా చేయండి..!