Home » ఈ 5 రాశుల‌కు చెందిన వారు డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డంలో దిట్ట‌..!

ఈ 5 రాశుల‌కు చెందిన వారు డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డంలో దిట్ట‌..!

by Anji
Ad

డ‌బ్బును వృధాగా ఖ‌ర్చు చేసే అల‌వాటు ఉన్న ఐదు రాశుల గురించి ప్ర‌ముఖ జ్యోతిష్య నిపుణులు వివ‌రించారు. వీరు చాలా డ‌బ్బును సంపాదించ‌వ‌చ్చు కానీ.. సంపాదించిన సొమ్మును ఆదా చేయ‌లేరు. సులువుగా ఖ‌ర్చు చేసే అల‌వాటుంటుంది. డ‌బ్బును చాలా తేలిక‌గా తీసుకునే ఈ ఐదు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొంద‌రూ వ్య‌క్తులు త‌మ జీవితంలో డ‌బ్బు ప్రాధాన్యం, దాని విలువ‌ను తెలుసుకోలేరు. సంప‌ద‌ను సుల‌భంగా ఖ‌ర్చు చేస్తారు. కొంత‌మంది క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును అన‌వస‌రంగా, వృథాగా ఖర్చు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

మ‌క‌ర‌రాశి :

ఈ రాశి వారికి చెందిన వారు డ‌బ్బును సంపాదించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ‌తారు. అదేవిధంగా ఖ‌ర్చు చేసే స‌మ‌యంలో అస్స‌లు ఆలోచించ‌రు. అయితే వీరిలో ఉన్న మంచి విష‌యం ఏమిటంటే.. ఓ వ‌స్తువును కొనే ముందు చాలా బేర‌మాడి మ‌రీ కొంటారు. కానీ వ‌స్తువు చాలా మంచిది. ఖ‌రీదైన‌ది అయితే దానికి ఆ ధ‌ర‌ను చెల్లించి సొంతం చేసుకోవ‌డంలో వెనుకాడ‌రు. మ‌క‌ర రాశి వారు త‌మ గురించి తాము ఎక్కువ‌గా ఆలోచిస్తుంటారు. ఈ రాశివారు ఆన్‌లైన్ షాపింగ్‌ను కూడా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డతారు.

సింహ‌రాశి :

డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డంలో సింహ‌రాశి వారు రెండ‌వ స్థానంలో ఉంటారు. ఈ రాశికి చెందిన వారు డ‌బ్బుకు విలువ ఇవ్వ‌రు. ఖ‌ర్చు విష‌యానికి ప‌రిశీలిస్తే.. త‌మ కోసం ఖ‌ర్చు చేయ‌డ‌మే కాకుండా ఇత‌రుల‌కు కూడా చాలా ఖ‌ర్చు చేస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో ఇత‌రుల‌కు ఇవ్వాల‌నే కోరిక‌తో ఖ‌రీదైన వ‌స్తువును కొనుగోలు చేస్తారు. సింహ‌రాశికి చెందిన వారు చాలా ఉన్న‌త‌మైన జీవన ప్ర‌మాణాల‌ను క‌లిగి ఉంటారు. వారి అభిరుచులు కూడా చాలా ఖ‌రీదైన‌వి.

Advertisement

వృష‌భరాశి :

ఈ రాశి చ‌క్రంలోని వ్య‌క్తుల‌కు తీవ్రంగా స్పందించే గుణ‌ముంటుంది. దుస్తులు, బూట్లు మ‌రీ ఏదైనా ఖ‌రీదైన వ‌స్తువులు అయినా ఖ‌రీదైన‌వి అయి ఉండాల‌ని కోరుకుంటారు. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతైనా ఖ‌ర్చు చేసేందుకు వెన‌కాడ‌రు. డ‌బ్బును వృథా చేయ‌డంలో ఇదొక మార్గం. ధ‌ర త‌క్కువ ఉన్న వ‌స్తువుల‌ను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌ర‌ని న‌మ్ముతారు. చేతిలోని మొత్తాన్ని వీలైనంత ఎక్కువ ఖ‌ర్చు పెట్ట‌డానికి చూస్తారు. ఈ రాశి వారికి ధ‌న‌వంతుల‌కు ఉన్న అల‌వాట్లు, అభిరుచులు ఉంటాయి. త‌మ కోరిక‌లు తీర్చుకోవ‌డానికి కావాల‌నుకున్న‌వి ద‌క్కించుకోవ‌డానికి డ‌బ్బును నీటిలా ఖ‌ర్చు చేస్తారు.

ధ‌నుస్సురాశి :

ఈ రాశి వారు తాము జీవితంలో విజ‌య‌వంతం అవుతామ‌ని భావిస్తారు. వీరికి డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డంలో ప‌రిమితి ఉండ‌దు. వీరికి ఖ‌రీదైన అభిరుచుల‌ను ఏదీ అడ్డుకోలేదు. ప్లైట్ టిక్కెట్ బుక్ చేసుకోవాల‌న్నా ల్యాప్‌టాప్ కొనాల‌న్నా స‌రే ఖ‌రీదు అయిన వాటి కోస‌మే చూస్తుంటారు. కొన్న ఖ‌రీదైన, అరుదైన వ‌స్తువుల‌ను వింటేజ్ క‌లెక్ష‌న్‌లా ఓ చోట ఉంచాల‌ని కోరుకుంటారు.

కుంభ రాశి :

కుంభ రాశి వారు ఎంత డ‌బ్బు చెల్లించాల్సి వ‌చ్చినా క‌చ్చితంగా ఉంటారు. అదేవిధంగా ఖ‌రీదైన ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. మార్కెట్‌లోకి కొత్త ఫోన్ రాగానే దానిని కొనాల‌నే ఆలోచిస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఖ‌ర్చు చేసి సొంతం చేసుకున్న దాని విలువ‌ను కూడా గుర్తిస్తారు.

Also Read :  Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి శ్ర‌మ పెరుగుతుంద

Visitors Are Also Reading