సాధారణంగా మానవ శరీరానికి ఆహారపదార్థాలు ఎంతో అవసరం. ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు, విటమిన్లు తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాలన్ని పుష్కలంగా అందినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చాలా వరకు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం, పిస్తా, కాజు వంటి వాటిని తింటే బలంగా ఉంటారని చెబుతారు. వాస్తవానికి వారు చెప్పినట్టు అవి తింటే బలంగా ఉండవచ్చు. కానీ పేద, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేసి తినాలంటే కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే వాటి ధర దాదాపు కిలో 900 నుంచి 1000 వరకు ఉంటుంది. ప్రధానంగా పోషకాహార లోపం అనేది పేద వారిలోనే అధికంగా ఉండడం గమనార్హం. అలాంటి బాదం, కాజు, పిస్తా వంటి వాటిపై ఆధారపడకుండా వాటికి ధీటుగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం ఉత్తమం.
ముఖ్యంగా పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. ఇక అందులో శనగలు కూడా చాలా ముఖ్యమైనవనే చెప్పవచ్చు. ఇక ఫాబేసి కుటుంబానికి చెందిన శనగల్లో పుష్కలంగా ఫోషకాలుంటాయి. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. శనగలు బరువు తగ్గించడానికి ప్రభావంతంగా పని చేస్తాయి. అదేవిధంగా జీర్ణక్రియను దృఢంగా తయారు చేసి శరీరానికి శక్తినిఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బీ9 మెదడు, కండరాలు, నాడీవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి సహాయపడుతుంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : మంచం మీద పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకండి.. ఉంచితే కష్టాలు తప్పవు..!
శనగలు రక్తపోటును నియంత్రిస్తాయి. వేయించిన శనగలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఇవి సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో చాలా తక్కువ కేలరీలు ఉండడం వల్ల శరీర బరువును నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా శనగల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఐరన్ రక్తం లోపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్త హీనత సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా వీటిని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రతి రోజూ మనం తినే ఆహారంలో శనగలను చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
ఇది కూడా చదవండి : మీకు ముఖం మీద పుట్టుమచ్చలు ఉన్నాయా..? అవి వేటికి సంకేతమంటే.?