వచ్చే సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగే ఆసియా కప్ టోర్నీపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. నిర్వహించాలని పిసిబి ప్రెసిడెంట్ చెబుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ లో అడుగుపెట్టేదే లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు. అవసరం అయితే తటస్థ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో ఈ టోర్నీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం వన్డే ఫార్మాట్ లో జరగాల్సిన ఆసియా కప్పు 2023 కు పాకిస్తాన్ ఆదిత్య ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ టోర్నీలో భారత్ ఆడుతుందని బీసీసీ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రకటించారు. ఆయన ప్రకటనకు విరుద్ధంగా పాకులో టీమిండి ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ సెక్రటరీ జైశ పేర్కొన్నారు.
Advertisement
ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త గల నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా భారతం పాకిస్తాన్ లో అడుగుపెట్టలేదని విషయాన్ని గుర్తు చేశారు. శత్రు దేశంలో ఆడబోమని తేల్చి చెప్పారు. ఆసియా కప్ లో భారత జట్టు పాల్గొనడం పై జైషా వ్యాఖ్యలకు తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా స్పందించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాకిస్తాన్లోనే ఆసియా కప్పు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. టోర్నీ నిర్వహణకు న్యాయబద్ధంగానే హక్కులు పొందామని రమీజ్ రాజా వెల్లడించారు. ఈ టోర్నీలో ఆడడం ఆడక పోవడం అనేది టీమిండియా ఇష్టమని.. భారత జట్టు ఆడిన ఆడకపోయినా తమకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదన్నారు. ఆసియా కప్ పాకులో కాకుండా.. ఒకవేళ ఇతర ఏ దేశంలో నిర్వహించినా పాకిస్తాన్ మాత్రం ఆడబోదని చెప్పుకొచ్చారు.
Advertisement
ప్రధానంగా పాకిస్తాన్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టును కూడా పాకులో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు రమీజ్ రాజా. భారత్ పాక్ మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా పూర్ణ లో అడుగుపెట్టబోమని పేర్కొనడం తగదన్నారు. టోర్నిలో ఆడడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని జైశాను ప్రశ్నించారు రమీజ్ రాజా. ఆసియా కప్పును తాము ప్రపంచ కప్ తో సమానంగా చూస్తామని స్పష్టం చేశారు. రమేష్ రాజా హెచ్చరికలు, జైషా పంతంతో 2023 లో జరిగే ఆసియా కప్ టోర్న ఇప్పుడు ఉత్కంఠ గా మారింది. ఇక మొత్తానికి ఆసియా కప్పు భారత్-పాకు మధ్య మరో వివాదానికి కేంద్రంగా మారినట్టు స్పష్టమవుతోంది.