Home » సలార్‌ చెత్త సినిమా.. ఫ్లాప్.. ప్రభాస్‌ మూవీపై ఆ నటి సెన్సేషన్ కామెంట్స్‌..!

సలార్‌ చెత్త సినిమా.. ఫ్లాప్.. ప్రభాస్‌ మూవీపై ఆ నటి సెన్సేషన్ కామెంట్స్‌..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది కోల్‌కతా బ్యూటీ పాయల్‌ ఘోష్‌.  ఇక ఆ తర్వాత ఊసర వెల్లి, మిస్కర్‌ రాస్కెల్‌ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లో కూడా మెరిసింది. అసలు ఏమైందో ఏమో తెలియదు.. కానీ  గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది పాయల్‌.  అప్పుడప్పుడూ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అవుతోంది. అలాగే పాయల్‌ షేర్‌ చేసే సోషల్‌ మీడియా పోస్టులు కూడా తెగ వైరలవుతున్నాయి.

Advertisement

తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచిందీ అందాల తార. ఇటీవల రిలీజైన ప్రభాస్‌ సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి. ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. అయితే సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే ప్రభాస్‌ యంగ్ అండ్ పవర్‌ఫుల్‌ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది’ అని వరుసగా ట్వీట్లు చేసింది పాయల్ ఘోష్‌. వీటితో పాటు ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు సాధించిన పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలను కూడా ఏకి పారేసింది పాయల్‌ ఘోష్‌. ‘

పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలు కూడా బాగోలేవు. అన్నీ జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయి’ అని ట్వీట్లలో రాసుకొచ్చింది పాయల్‌ ఘోష్‌. ప్రస్తుతం పాయల్‌ ట్వీట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ ట్వీట్స్‌కు ఎవరూ కూడా పెద్దగా స్పందించడం లేదు. పాయల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు లేవు. వార్తల్లో నిలిచి ఫేమస్‌ అయ్యేందుకే ఇలాంటి పనికిమాలిన కామెంట్స్‌ చేస్తుందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2020లో రామ్‌దాస్‌ అథవాలే స్థాపించిన రాజకీయ పార్టీలో చేరింది పాయల్‌ ఘోష్‌. అంతేకాదు మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా ఎంపికైంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading