Home » న్యూ లుక్‌లో ప‌వ‌న్.. వెకెష‌న్ పిక్ వైర‌ల్..!

న్యూ లుక్‌లో ప‌వ‌న్.. వెకెష‌న్ పిక్ వైర‌ల్..!

by Anji
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నూత‌న లుక్‌లో ఒక పిక్ ఇప్పుడు నెట్టిట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. వెకేష‌న్ నుండి తిరిగి వ‌చ్చిన ప‌వ‌న్ తాజాగా హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఎయిర్‌ఫోర్ట్‌లో ఆయ‌న వ‌స్తున్న వీడియోను తీసిన ఓ అభిమాని ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసారు. ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది. అందులో ప‌వ‌న్ బ్లాక్ క‌ల‌ర్ టీష‌ర్ట్‌, జీన్స్ ధ‌రించారు. ఇక ప‌వ‌న్ వెకేష‌న్ విష‌యానికొస్తే.. భీమ్లానాయ‌క్ వాయిదా ప‌డ‌డంతో ర‌ష్యా విహార‌యాత్ర‌కు వెళ్లారు ప‌వ‌న్. అక్క‌డ ఆయ‌న భార్య అన్నా లెజ్నేవా పిల్ల‌ల‌తో క‌లిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసారు. కోవిడ్ కంటే ముందే ప‌వ‌న్ భార్య పిల్ల‌లు ర‌ష్యాకు వెళ్లారు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా అక్క‌డ‌కి వెళ్లి కుటుంబంతో క‌లిసి క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల‌ను సెల‌బ్రెట్ చేసుకున్నారు. తాజాగా హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చారు ప‌వ‌న్‌.

Advertisement

Pawan

Advertisement

ఇక సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప‌వ‌న్ కొత్త చిత్రం భీమ్లానాయ‌క్ సంక్రాంతికి విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. రాధేశ్యామ్ ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాల కోసం వాయిదా ప‌డింది. ఇప్పుడు ఆ రెండు సినిమాలు కూడా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ‌క త‌ప్ప‌లేదు. ప‌వ‌న్ ఒక‌వైపు సినిమాలు, మ‌రొక‌వైపు పాలిటిక్స్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ విరామం లేకుండా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నారు.

Visitors Are Also Reading