పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడనే విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నాడు. కరాటే నేర్చుకోవడం కోసం చాలా మంది సులభంగా నేర్చుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకోసం చాలా చెమటోడ్చాల్సి వచ్చిందట.
Also Read : ఆ విషయం లో సపోర్ట్ చెయ్యనందుకే విజయశాంతి- చిరు మధ్య 20 ఏళ్ళు మాటలు లేవా ?
Advertisement
ముఖ్యంగా తమిళనాడులో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు కావాల్సిన వ్యక్తి దగ్గరే నేర్చుకోవాలని దృఢ సంకల్పంతో దాదాపు చాలా రోజులు ట్రైనర్ ఇంటి చుట్టూ తిరిగాడట. ఎందుకంటే ఆ ట్రైనర్ అప్పటికే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం బంద్ చేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ మాత్రం నేర్చుకుంటే అతని వద్దనే నేర్చుకోవాలని పట్టుబట్టాడట. ఎంత చెప్పినా వినకపోయే సరికి పవన్ కి ఆ ట్రైనర్ కొన్ని కండీషన్లతో కూడిన శిక్షణ ఇచ్చాడట. ఉదయం 5 గంటలకే ఇంటికి రావాలని అదేవిధంగా రాత్రి 11 గంటల వరకు తనతోనే ఉండాలని తనకు ఖాళీ ఉన్న సమయంలో ఒక అర్థగంట మాత్రమే నేర్పిస్తానని చెప్పాడట.
Also Read : “మన టాలీవుడ్ సెలెబ్రెటీల పెళ్లి పత్రికలు చూసారా ?
Advertisement
పవన్ కళ్యాణ్ అందుకు ఓకే చెప్పాడట. రోజు నిద్రలేవగానే ఆ ట్రైనర్ ఇంటికి వెళ్లి ఎదురు చూసేవాడట. అతనికి టీ పెట్టి ఇవ్వడం, కరాటే నేర్చుకునే ప్రదేశాన్ని శుభపరుచుకోవడం వంటి పనులన్నీ కూడా పవన్ దగ్గరుండి చూసుకునేవాడట. అప్పటివరకు పవన్ పేరు కళ్యాణ్ కుమార్ గానే ఉండేది కానీ మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తరువాత సదరు ట్రైనర్ కి పవన్ కళ్యాణ్ గురించి అసలు విషయం తెలిసిందట. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ కుమార్ ఇతడే అని తెలియడంతో ఆ తరువాత సీరియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడట. అలా సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చిన తరువాత బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్. కళ్యాణ్ కుమార్ గా ఉన్న అతని పేరును పవన్ అని తనకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టాడట.
Also Read : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?
ఈ విషయాన్ని ఆ ట్రైనర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం ఇంత కష్టపడ్డాడా అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఎవరికైనా సరే అడిగినంత డబ్బు ఇచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తన ట్రైనర్ పై ఉన్న నమ్మకంతో అంతలా కష్టపడి మరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఇక ఆ తరువాత కరాటేలో కూడా కొన్ని టెక్నిక్స్ కోసం జపాన్ లో కొద్ది రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడట. ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా కోసం కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది.
Also Read : 29 రోజుల్లో సినిమాని తీసి, 500 రోజులు ఏకధాటిగా ఆడిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?