Home » Pawan Kalyan : ఆస్తులు దానం చేస్తున్న పవన్ కళ్యాణ్ భార్య ?

Pawan Kalyan : ఆస్తులు దానం చేస్తున్న పవన్ కళ్యాణ్ భార్య ?

by Bunty
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమాల్లో అద్భుతమైన విజయాలను సాధించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు.

pawan-kalyan-and-Third-wife-anna

pawan-kalyan-and-Third-wife-anna

 

జనసేన పార్టీ ద్వారా తన సేవలను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బాటలోనే తన భార్య అన్నా లేజీనావో కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవల అన్నా లేజీనావో ఓ అనాధ ఆశ్రమంలో క్రిస్మస్ వేడుకలను దగ్గరుండి జరిపించారు. ఆ సమయంలో చిన్న పిల్లలకు అవసరమైన నిత్యవసర సరుకులను ఆమె విరాళంగా అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.

Advertisement

అంతేకాకుండా న్యూ ఇయర్ రోజున సెలబ్రిటీలందరూ కుటుంబసభ్యులతో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటే అన్నా లేజీనావో మాత్రం అనాధ ఆశ్రమంలో చిన్న పిల్లలతో జరుపుకున్నారు. అక్కడ చిన్నారులతో కేక్ కట్ చేసి వారికి నిత్యవసర సరుకులను అందించారు. అంతేకాకుండా కొంతమంది చిన్నారుల స్కూల్ ఫీజును చెల్లించారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నా లేజీనావోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నయ్య బాటలోనే వదినమ్మ కూడా సేవా కార్యక్రమాలు చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading