ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జనసేనని పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా పోతున్నారు. ఈ నేపథ్యంలోనే, జనసేనని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రచార రతాన్ని సిద్ధం చేశారు. దానికి వారాహి అంటూ పేరు పెట్టారు. అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన హంగులతో వారాహి వాహనం సిద్ధమైంది. హైదరాబాదులో ఈ వాహనాన్ని ప్రత్యేకంగా చేయించారు. అయితే ఈ వాహనానికి వాడిన రంగు వివాదాస్పదమయింది. మిలటరీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగును వాడటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా వైసిపి నేతలు ట్రోలింగ్ ప్రారంభించారు.
Advertisement
ఈ క్రమంలో వైసిపి, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఈ వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారని తెలుస్తోంది. వారాహి కలర్ ఆలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిబంధనల మేరకు ఉన్నందున రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వివరణ ఇచ్చారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం, చాప్టర్ 121 లో ఒక విషయం స్పష్టంగా ఉంది.
Advertisement
తాజాగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారాహి వాహనం గురించి పలు విషయాలను వెల్లడించారు. ఇక ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం 5000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. సాధారణంగా స్పెషల్ నెంబర్స్ అనేవి ఈజీగా ఎవరికి అలర్ట్ కావు. అలాంటివి మనకు కావాలి అంటే ప్రభుత్వానికి 5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్స్ తీసుకోవచ్చు. వారాహికి కూడా 5000 కట్టి 8384 అనే రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం పవన్ ప్రచార రతమైన వారాహికి ఎమరాల్డ్ గ్రీన్ పెయింటింగ్ వేయడంతో ఈ వివాదం ముగిసినట్టు కనిపిస్తోంది.
READ ALSO : Andrew Flintoff : ఆండ్రూ ఫ్లింటాఫ్ కు యాక్సిడెంట్.. హెలికాఫ్టర్ లో తరలింపు