పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అనేది అందరికి తెలుసు. అయితే ఇక్కడ సినిమాల్లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ప్రాల్కు మంచి చేయాలనీ రాజకీయాల్లోకి వచ్చి రెండు సంవత్సరాలు సినీ అభిమానులకు దూరమయ్యాడు. కానీ మల్లి సినిమాలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ ఆగడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుండి వచ్చినవి రెండు సినిమాలే. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్. అయితే ఈ రెండు సినిమాలే విడుదల అయినప్పటికీ ప్రస్తుతం ఆయన లైన్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Advertisement
పవన్ పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసింది. ఇక ఆ తర్వాత కూడా పవన్ చేయనున సినిమాల్లో ఓ రీమేక్ అభిమానులను బాగా ఊరిస్తుంది. అదే తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్ అనే సినిమా. దీనిని తెలుగులో పవన్ రీమేక్ చేయబోతున్నాడు. అక్కడ ఈ సినిమాను డైరెక్ట్ చేరిన ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖనినే ఈ సినిమాను ఇక్కడ కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ తో పటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నాడు.
Advertisement
అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యునరేషన్ భారీ మొత్తంలో ఉంది. ఈ సినిమాలో తన పాత్ర మొత్తం పూర్తి చేయడానికి 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట పవన్. కానీ ఆ 20 రోజులకే భరిగా ఛార్జ్ చేస్తున్నాడట. ఎంత అంటే రెండున్నర కోట్లు. అంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక్కో రోజుకు 12.5 లక్షలు తీసుకోబోతున్నట్లు అర్ధం అవుతుంది. దాంతో ఇప్పుడు పవన్ రెమ్యునరేషన్ అనేది పెద్ద చర్చగా మారింది. కానీ ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు. కానీ ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం భారీ మొత్తమే అని చెప్పాలి.
ఇవి కూడా చదవండి :