పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటూ రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఓ వైపు సినిమాలలో నటిస్తునే మరోవైపు ఏపీ రాజకీయాల్లో జగన్ ను ఢీ కొట్టేందుకు పావులు కదుపుతున్నాడు. వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీని పవన్ బలోపేతం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో రెండు స్థానలలో పోటీ చేసి ఓడినప్పటికీ ఆ సారి అలా జరగకుండా ఉండేందుకు ముందు నుండే పవన్ వ్యూహాలు రచిస్తున్నాడు. మరోవైపు పవన్ వెంట నాగబాబు ఉంటూ ఆయన కూడా జనసేనలో కీలకనేతగా వ్యవహరిస్తున్నాడు.
Advertisement
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ను అధికార వైసీపీ నాయకులు తరచూ మూడు పెళ్లిళ్ల విషయం తీసుకువస్తూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ కల్యాన్ గురించి మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాన్ త్వరలో మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ వార్తల్లో కథనాలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తరవాత రష్యా నటి అన్నా లెజొనోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే పవన్ ఇప్పుడు మూడో భార్యకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లికి సిద్దం అవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందని ఆలోచిస్తే మాత్రం ఫేక్ వార్తలే అనిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ తన మూడు పెళ్లిళ్ల మ్యాటర్ గురించి మాట్లాడుతూ..ఇద్దరికి విడాకులు ఇచ్చాను భరణం కూడా ఇచ్చాను. ఇప్పుడు మూడో భార్యతో కలిసి ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. దాంతో పవన్ అంటే గిట్టనివారే ఈ ప్రచారం చేస్తున్నారని అర్థం అవుతోంది.
ALSO READ : సింహా అనే టైటిల్ తో వచ్చిన బాలయ్య సినిమాలు…..బాక్సాఫీస్ వద్ద వాటి రిజల్ట్స్..!