Home » సింహా అనే టైటిల్ తో వ‌చ్చిన బాల‌య్య సినిమాలు…..బాక్సాఫీస్ వ‌ద్ద వాటి రిజ‌ల్ట్స్..!

సింహా అనే టైటిల్ తో వ‌చ్చిన బాల‌య్య సినిమాలు…..బాక్సాఫీస్ వ‌ద్ద వాటి రిజ‌ల్ట్స్..!

by AJAY
Ad

కొంత‌మంది హీరోల‌కు కొన్నిటైటిల్స్ క‌లిసి వ‌స్తాయి. ఆ టైటిల్ తో సినిమా వ‌చ్చింది అంటే చాలు హిట్ ప‌డినట్టే. అలా బాలయ్య కు కూడా టైటిల్స్ విష‌యంలో ఓ సెంటిమెంట్ ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ ఎక్కువ‌గా సింహా అనే టైటిల్ తో సినిమాలు చేస్తుంటారు. తాజాగా ఆయ‌న వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టించాడు.

Advertisement

ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమా కంటే ముందు బాల‌య్య సింహా అనే టైటిల్ తో చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….2018 లో బాల‌య్య జైసింహా అనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.

2010 లో బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో సింహా అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో న‌మిత‌, న‌య‌న‌తార హీరోయిన్ లుగా న‌టించారు. చాలా కాలంగా స‌రైన హిట్ లేక డీలా ప‌డిపోయిన బాల‌య్య‌కు ఈ సినిమా విజయం బూస్ట్ ఇచ్చింది.

బాల‌య్య హీరోగా 2014 లో ల‌క్ష్మీన‌ర‌సింహా సినిమా వ‌చ్చింది. ఈ సినిమా త‌మిళ చిత్రం స్వామికి రీమేక్ గా వ‌చ్చింది. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

2002 సంవ‌త్స‌రంలో బాల‌య్య సీమ‌సింహం సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో బాల‌య్య పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

బాల‌య్య బి గోపాల్ కాంబినేష‌న్ లో 2001 సంవ‌త్స‌రంలో న‌ర‌సింహ నాయుడు సినిమా వ‌చ్చింది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా టీవీలో వ‌చ్చినా మిస్ కాకుండా చూసే ప్రేక్ష‌కులు ఉన్నారు.

samarasimhareddy

1999లో బాల‌య్య బిగోపాల్ కాంబినేష‌న్ లో స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా వ‌చ్చింది. ఈ సినిమా ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు ట్రెండ్ సెట్ట‌ర్ గా నిల‌వ‌డం తో పాటూ టాలీవుడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. బాలయ్య హీరోగా 1994లో బొబ్బిలి సింహం సినిమా వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. 1983 లో ఎన్టీఆర్ బాల‌య్య క‌ల‌సి సింహం న‌వ్వింది అనే సినిమాతో వ‌చ్చారు. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.

ALSO READ: చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading