పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. త్రిముఖ పోరుతో జనసేనను బలి చేయడానికి నేను సిద్ధంగా లేను.. ఈసారి పొత్తులుంటాయని వెల్లడించారు. ఏ పార్టీతోనూ నాకు ప్రేమ లేదు.. ద్వేషం లేదు.. వ్యూహం తప్ప.. వైసీపీనే మన ప్రధాన ప్రత్యర్థి అని వెల్లడించారు పవన్ కల్యాణ్.
READ ALSO : చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?
Advertisement
జనసేనకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ఓటింగ్ ఉంది.. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25 శాతం.. ఉభయ గోదావరి జిల్లాల్లో 35 శాతం ఓటింగ్ ఉంది.. ఈ ఓటింగుతో సీఎం కావడం సాధ్యమా..? అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో రాజకీయం చేస్తోందంటే కారణం పొత్తులే.. పొత్తులతోనే పార్టీ బలోపేతం అవుతుందని వెల్లడించారు.
Advertisement
READ ALSO : Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?
చంద్రబాబు మనల్ని మోసం చేస్తే మోసపోతామా..? సలహాలిచ్చే కాపు నేతలు కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ను ఎందుకు నిలదీయరు..? అని అగ్రహించారు పవన్. డిసెంబరులో ఎన్నికలు పెడతారు.. జూన్ నుంచి ప్రజల్లో తిరుగుతా.. వ్యూహం మాది.. బాధ్యత మీది.. వ్యూహాల సంగతి మాకు వదిలిపెట్టండి.. బాధ్యతతో పని చేయండని దిశా నిర్దేశం చేశారు పవన్ కల్యాణ్. మేం చేయలేమని వైసీపీ భావిస్తే.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు..? టీడీపీనైనా పట్టించుకోవడం లేదు.. కానీ, మమ్మల్ని మాత్రం వదలడం లేదు. వైసీపీకి మేమంటే భయం అందుకే మమ్మల్ని విమర్శిస్తు న్నారన్నారు పవన్ కల్యాణ్.
READ ALSO : Ustaad Bhagatsingh: “ఉస్తాద్” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్.. పవన్ ఫ్యాన్స్ కు ఇక జాతరే