Home » రేణు దేశాయ్ కోసం పవన్ కళ్యాణ్ అలాంటి పని చేయబోతున్నారా..?

రేణు దేశాయ్ కోసం పవన్ కళ్యాణ్ అలాంటి పని చేయబోతున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఏదో పవర్ ఉంది.ఆయన ఏ విధంగా పవర్ తో మాట్లాడతారు ఆయన అభిమానులు కూడా అంతే పవర్ తో ఉంటారు. అందుకే ఆయన పవర్ స్టార్ గా మారారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు అంతా భక్తులే ఉంటారని అనడం గమనార్హం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటూ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

Advertisement

అయితే కొంతమంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక తరచు ఆయన మూడు పెళ్లిళ్ల గురించి తీస్తూ విసిగిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక రేణు దేశాయ్ బద్రి సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి దాకా దారితీసింది. కట్ చేస్తే ఈ మధ్యకాలంలో రేణు దేశాయ్ గుండెకు సంబందించిన వ్యాధితో బాధపడుతుందట.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమె కోసం అలాంటి పని చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ పని ఏంటయ్యా అంటే.. పవన్ కళ్యాణ్ విడాకుల సమయంలో ఒక్క రూపాయి కూడా రేణు దేశాయ్ కి ఇవ్వలేదట. ప్రస్తుతం ఆమె ఇబ్బందుల్లో ఉంది కాబట్టి రేణు దేశాయ్ పేరు మీద 100 కోట్ల ఆస్తిని పవన్ కళ్యాణ్ రాయనున్నారని తెలుస్తోంది. ఇది రేణు దేశాయ్ ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులకి అలాగే తన పిల్లల భవిష్యత్తుకు 100 కోట్ల ఆస్తులు రాయనున్నట్లు సమాచారం.ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading