Home » త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. అందుకోసమేనా ?

త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. అందుకోసమేనా ?

by Anji
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు రాజకీయంగా కూడా చాలా బిజీగా ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ వాటిని పూర్తి చేస్తున్నారు. పవర్ స్టార్ తాజాగా నటిస్తున్న సినిమాలలో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో సగభాగం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ మరో సగభాగం తీయడానికి అడ్డంకులు ఏర్పడుతాయి. రాజకీయాల్లో చురుకుగా ఉండటం వల్ల ఓజీ షూటింగ్ నెమ్మదించింది. 

Advertisement

పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా  పవన్ కనిపించబోతున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అంచనాలను భారీగా పెంచింది. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను డీవీవీ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం విషయంలోపవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో పవన్ చేస్తున్న ప్రతీ సినిమాకి త్రివిక్రమ్ ఇన్వాల్ మెంట్ కచ్చితంగా ఉంటుంది. బ్రో మూవీలో కూడా త్రివిక్రమ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడంతో చాలా సీన్స్ తీసేశారు. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది.    అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఓజీ సినిమా విషయంలో కూడా మళ్లీ త్రివిక్రమ్ ఎక్కువగా జోక్యం చేసుకుంటాడట. దర్శకుడు సుజిత్ కి ఇష్టం లేకపోయినా ఒకటి రెండు సీన్లలో మార్పులు చేయమని సూచించాడట. ఇలా ప్రతీ విసయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకోవడం వల్ల   సుజిత్ పై ఒత్తిడి ఎక్కువగా పడిందని.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకొని త్రివిక్రమ్ మీద ఫైర్ అయినట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంది తీసేయడం సరికాదని.. ఏదైనా ఉంటే ముందే స్క్రిప్ట్ దశలో ఉండగా చెప్పాల్సిందని.. ఇప్పుడు ఇలా చెబితే ఎలా అంటూ పవన్ త్రివిక్రమ్ పై అరిచాడనే టాక్ సినీ వర్గాల నుంచి  గట్టిగానే వినిపిస్తోంది. వీరిద్దరూ చాలా క్లోజ్ అయినప్పటికీ.. పవన్ త్రివిక్రమ్ పై అరిచాడా అని మరికొందరూ చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలి మరీ. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading