Home » పవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ బిగ్ అప్డేట్

పవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ బిగ్ అప్డేట్

by Bunty

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉంటున్నారు. రాజ‌కీయాల‌కు కాస్త గ్యాప్ దొరికిన‌పుడు గ‌తంలో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే బీమ్లా నాయ‌క్ సినిమా పూర్తిచేశారు. ఈ మూవీ సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వ‌చ్చే జ‌న‌వ‌రి 12 న రిలీజ్ కాబోతున్న‌ది. బీమ్లా నాయ‌క్ పూర్తికావ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాపై దృష్టి సారించారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పూర్త‌యింది.

మ‌ధ్య‌లో బీమ్లా నాయ‌క్ సినిమా పూర్తిచేయాల్సి రావ‌డంతో ఆ మూవీని పూర్తి చేశారు. ఇప్పుడు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ ప‌నిలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే కొంత పార్ట్ పూర్తి చేశారు. పీరియాడిక‌ల్ స్టోరీ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు క్రిష్, ప‌వ‌న్ ఇద్ద‌రూ కూర్చొని స్క్రిప్ట్ రీడింగ్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ మూవీ ఏప్రిల్ 29, 2022న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొఘ‌ల్ సామ్రాజ్యానికి సంబంధించిన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఎ ఎం ర‌త్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Visitors Are Also Reading