సినిమాల్లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో తర్వాత మళ్లీ ఆ ప్లేస్ తో అతని కుమారుడిని చూడాలని ఇష్టపడుతుంటారు. అంతే కాకుండా అతడి ఎంట్రీ కూడా గ్రాండ్ గా ఉండాలని కోరుకుంటారు. ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్ లో సపోర్ట్ కూడా చేస్తారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు.
అఖిరా రీసెంట్ గా 18 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం సంగీతంతో పాటు జిమ్ నాస్టిక్ లాంటివి నేర్చుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో అకీరా ఎంట్రీ ఉండబోతుంది అంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ వీడియోలు చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Advertisement
Advertisement
మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో అకీరా ఎంట్రీ ఉండబోతుందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. రీసెంట్ గా అకీరా పుట్టినరోజు సందర్భంగా కిక్ బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అకిరా ఎంట్రీ పై మరోసారి పెద్ద చర్చ జరిగింది. దాంతో అకీరా తల్లి రేణు దేశాయ్ సినీ ఎంట్రీ పై స్పందించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.
అకిరా నందన్ కు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏ సినిమాను కూడా ఓకే చేయటం లేదని చెప్పింది. మరోవైపు అకీరా ఎంట్రీ పై వస్తున్న రూమర్లను ఏమాత్రం నమ్మవద్దని తేల్చిచెప్పింది. ఇక రేణుదేశాయ్ చెప్పిన వార్త విని పవన్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఎంతో కాలంగా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
Also Read: జగన్ సర్కార్ పై బాబు గోగినేని సెటైర్లు..? రాష్ట్రంలో ఫ్యాన్ లు ఆగిపోయాయట అంటూ…!