Home » అకీరా చేసిన ప‌నికి హ‌ర్ట్ అవుతున్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్…ఏం చేశాడంటే..?

అకీరా చేసిన ప‌నికి హ‌ర్ట్ అవుతున్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్…ఏం చేశాడంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ ఇప్ప‌టికే పెద్ద‌వాడు అయ్యాడు. దాంతో అకీరా నంద‌న్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

అకీరా ఫోటో క‌నిపిస్తే చాలు అభిమానులు సంబుర‌పడిపోతుంటారు. మా అన్న కొడుకు అంటూ అకీరాను ఎంతో అప్యాయంగా పిలుచుకుంటారు. అయితే అకీరా మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను హ‌ర్ట్ చేస్తున్నాడు. తాజాగా అకీరా నంద‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చాడు. రైట‌ర్స్ బ్లాక్స్ అనే షార్ట్ ఫిలిమ్ కు అకీరా స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. కాగా ఈ షార్ట్ ఫిల్మ్ లింక్ ను అడవి శేషు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అకీరా అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని అని..అకీరా మ్యూజిక్ అందించ‌డం ఆనందంగా ఉంద‌ని ట్వీట్ చేశాడు.

Advertisement

 

అంతే కాకుండా షార్ట్ ఫిలిం టీమ్ కు అభినంద‌న‌లు చెప్పాడు. అయితే అకీరా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌డం పై ప‌వ‌న్ కల్యాణ్ అభిమానులు నిరాశ‌గా ఉన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడు స్క్రీన్ పై క‌నిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు.కానీ అకీరా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇవ్వాడంతో ఇలా చేశావేంటి బ్రో అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇక మ‌రికొంద‌రు అభిమానులు మాత్రం అకీరా త‌న‌కు ఇష్ట‌మైన ప‌ని చేస్తున్నాడు అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ALSOREAD : మెస్ నుండి ప్రింటింగ్ ప్రెస్ వ‌ర‌కూ….సినిమాల్లోకి రాక‌ముందు ఎన్టీఆర్ చేసిన వ్యాపారాలు ఇవే..!

Visitors Are Also Reading