Home » అలా అనుకుంటే పార్టీలోకి రాకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!!

అలా అనుకుంటే పార్టీలోకి రాకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!!

by Sravanthi
Ad

ఎన్నో సినిమాలు తీసి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి సినిమాలకు దూరమయ్యారు.. ప్రస్తుతం పార్టీ కి సంబంధించిన విషయాల పైన దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో జనసేన ఐటీ ప్రతినిధుల ముగింపు సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి కోసమో, వ్యక్తిగత ఆశల కోసమో పార్టీని పెట్టలేదని అన్నారు.. పదవి అనేది మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ దాని వెంట మనం పడకూడదని తెలియజేశారు. జాతీయ సమగ్రతా సాధించాలంటే మనందరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నో అనుభవాలు సంపాదించినట్లు పవన్ తెలియజేశారు.

Advertisement

Advertisement

ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జనసేన వాటికి వ్యతిరేకం కాదని, సంక్షేమం పేరుతో అభివృద్ధి విస్మరిస్తే మాత్రం వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.. కేవలం ఎలక్షన్ల కోసమే పార్టీలోకి రావద్దని, ఒక కొత్త తరానికి బాధ్యతలను గుర్తు చేస్తూ, మరో తరాన్ని మేల్కొల్పడం కోసమే జనసేన పార్టీని స్థాపించామని వెల్లడించారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీలంక మాదిరి పరిస్థితులు రావొచ్చని, కానీ అక్కడకు రాకూడదనే కోరుకుంటున్నానని చెప్పారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరు కూడా బయటకు వలస వెళ్లే పరిస్థితి ఉండదని తెలియజేసారు.

ఐటి పరిశ్రమ ఇక్కడే డెవలప్ చేస్తానని అన్నారు.. అనుభవం లేని వారికి పదవులు కట్టబెడితే వైసిపి ప్రభుత్వం లాగా ఉంటుందని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ప్రభుత్వంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తనవంతుగా ప్రజలకు ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ వెల్లడించారు.

ALSO READ:

Visitors Are Also Reading