Home » Pavitra-lokesh : నరేష్ కంటే అతడు నాకు అంటే చాలా ఇష్టం !

Pavitra-lokesh : నరేష్ కంటే అతడు నాకు అంటే చాలా ఇష్టం !

by Bunty
Ad

పవిత్ర లోకేష్… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్. ఇటీవల కాలంలో ఈ పేరు బాగా మారుమ్రోగుతుంది. దీనికి కారణం కృష్ణ గారి అబ్బాయి నరేష్. నరేష్ మరియు పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయం మీడియాకు లీక్ అయినప్పటి నుంచి…. ఈ జంట గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తన భర్తను వదిలి… ఒంటరిగా పవిత్ర లోకేష్ ఉంటున్న సంగతి తెలిసిందే. అటు నరేష్ తన మూడో భార్యను వదిలేసి పవిత్ర వెంబడి పడుతున్నాడు.

Advertisement

ఇక వీరిద్దరి మధ్య అండర్ స్టాండ్… రావడంతో.. త్వరలోనే లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అంతేకాదు ఇటీవల మళ్లీ పెళ్లి అనే సినిమాతో సంచలనం క్రియేట్ చేశారు వీరిద్దరూ. ఈ సినిమా మొన్న మే 26వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కన్నడ భాషలో కూడా రిలీజ్ అయి.. మంచి టాక్ తెచ్చుకుంటుంది. అంతేకాదు నిన్న సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక ఈ తరుణంలోనే నటి పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.

Advertisement

తన జీవితంలో తన క్రష్ ఎవరో తాజాగా బయటపెట్టింది నటి పవిత్ర. తాను అక్కినేని నాగార్జున అంటే పడి చస్తానని… ఆయన అంటే క్రష్ ఉందని పవిత్ర లోకేష్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మన్మధుడు సినిమాతో నాగార్జున నటనకు తాను ఫిదా అయినట్లు వెల్లడించింది. అప్పుడే నాగార్జున పై ప్రేమ ఏర్పడిందని ఆమె వెల్లడించింది. ఒకప్పుడు నరేష్ కంటే ఎక్కువగా నాగార్జునను ప్రేమించే వాడినని…. కానీ ఇప్పుడు తనకు నరేష్ అంటే ఎక్కువ ఇష్టమని తెలిపింది. ఇక ఈమె కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !

IPL 2023 : ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా?

Visitors Are Also Reading