నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారం ప్రస్తుతం ఓ వివాదస్పదమైంది. తామిద్దరం ప్రాణ స్నేహితులమని నరేష్ పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉండడాన్ని నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వ్యతిరేకించారు. ఈ మేరకు మైసూర్లో నరేష్-పవిత్ర ఉంటున్న హోటల్ గది వద్ద ఆమె ఆందోళన చేసారు.
Advertisement
ఇప్పుడు మొత్తం వ్యవహారంలోకి పవిత్ర భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ పవిత్ర తన భార్యే అని పేర్కొంటున్నాడు సుచీంద్ర ప్రసాద్. తన పాస్‌పోర్టుపై భార్యగా పవిత్ర పేరు ఉన్నదని చెబుతున్నాడు. తామిద్దరం సహజీవనం చేయలేదని, భార్య భర్తలుగా 16 ఏళ్లు కాపురం చేశామని పేర్కొన్నారు. తామిద్దరం భార్యభర్తలమనే విషయం కర్నాటక మొత్తం తెలుసు అని.. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
Advertisement
ఒక వీటన్నింటికి మించి తనకు ఇద్దరు పిల్లలున్నారని వెల్లడించారు. పవిత్ర తనకు విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ తాము భార్యభర్తలమే అని చెప్పుకొచ్చారు. అదేవిదంగా నరేష్ ఎవరో తనకు తెలియదని చెప్పారు సుచీంద్ర. తన భార్య పవిత్ర షూటింగ్స్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లి వస్తుందని.. అంతవరకు మాత్రమే తెలుసని నరేష్ తో ఆమెకు ఎఫైర్ ఉందా లేదా అనే విషయం తనకు తెలియదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి తన స్నేహితులు చెబితేనే తెలిసిందని వివరించారు సుచీంద్ర.
Also Read :
పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయిన నరేష్ భార్య రమ్య
మూడో భార్యతో ప్రాణహాని ఉందంటూ నరేష్ సంచలన ఆరోపణలు..ట్విస్ట్ ఏంటంటే..?