Home » పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేష్ భార్య ర‌మ్య‌

పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేష్ భార్య ర‌మ్య‌

by Anji
Ad

ప్ర‌స్తుతం ఓ వారం రోజుల నుంచి న‌రేష్‌-ప‌విత్రల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ న‌డుస్తోంది. సోష‌ల్ మీడియాలో అయినా ఎల‌క్ట్రానిక్ మీడియాలో అయినా పేప‌ర్‌లో అయినా వీరు నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు. ఓరోజు న‌రేష్ స్పందిస్తే.. మ‌రొక రోజు అత‌ని భార్య ర‌మ్య ర‌ఘుప‌తి, మ‌రొక రోజు ప‌విత్ర ఇలా ఎవ్వ‌రో ఒక‌రూ వారి రిలేష‌న్ గురించి స్పందిస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం న‌రేష్ అత‌ని మూడ‌వ భార్య ర‌మ్య మ‌ధ్య పెద్ద పంచాయ‌తీగానే మారింది.

Advertisement

ఇక న‌రేష్‌-ప‌విత్ర లోకేష్ జంట ఇవాళ మైసూర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఓ హోట‌ల్‌లో ఉన్న ఈ జంట‌ను ర‌మ్య ర‌ఘుప‌తి వారిద్ద‌రినీ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. బ‌య‌ట‌కు వెళ్తున్న వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఈ నేప‌థ్యంలోనే ప‌విత్ర‌ను ర‌మ్య చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. అక్క‌డే ఉన్న పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. ఇక ర‌మ్య‌ను చూసి న‌రేష్ విజిల్స్ వేసుకుంటూ ప‌విత్ర‌తో క‌లిసి లిప్ట్‌లో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఓ అపార్ట్‌మెంట్‌లో న‌రేష్ ప‌విత్ర ఒకేరూమ్‌లో ఉన్నార‌ని వార్త‌తో మీడియా క‌వ‌రేజ్ చేసేందుకు వెళ్లింది. అలెర్ట్ అయిన న‌రేష్‌-ప‌విత్ర‌లు గ‌ట్టిగా కేక‌లు వేస్తూ ఓ అపార్ట్‌మెంట్ లోకి వెళ్లారు. మీడియా రావ‌డంతో అక్క‌డి నుంచి లిప్ట్‌లో ఎక్కి వీరిద్ద‌రూ వెళ్లారు. ముఖ్యంగా న‌రేష్ వేసిన విజిల్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారాయి. మ‌రొక వైపు న‌రేష్ న‌న్ను మోసం చేశాడ‌ని.. కొంత కాలం వ‌ర‌కు మేము క‌లిసే ఉన్నాం. అలాగ‌ని విడాకులు తీసుకోలేదని.. మాకు పిల్ల‌లున్నారని, న‌రేష్ ఎలా పెళ్లి చేసుకుంటాడ‌ని ప్ర‌శ్నించారు.

Also Read : 

పెళ్లి త‌రువాత సంతోషంగా ఉండ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన స‌మంత‌..!

ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో హిట్ అందుకున్న గోపీచంద్..ఆ సినిమా ఏదంటే..?

 

Visitors Are Also Reading