Home » పవన్ వదిన సురేఖ దగ్గర రెండు కోట్లు అప్పు తీసుకున్నారా..? ఆస్తులు, అప్పులు ఎంత అంటే..?

పవన్ వదిన సురేఖ దగ్గర రెండు కోట్లు అప్పు తీసుకున్నారా..? ఆస్తులు, అప్పులు ఎంత అంటే..?

by Sravya
Ad

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గము నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఆస్తులు వివరాలు అప్పులని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖనుండి కూడా అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఆస్తులు చిట్టా మొత్తం ఇందులో పొందపరిచారు పవన్ కళ్యాణ్ ఐదేళ్ల కాలంలో 114 కోట్ల రూపాయల ఆదాయం పొందినట్లు తెలియజేశారు. అయితే అప్పులు కూడా భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. లోన్ల తో కలిసి ఏకంగా రూ.64 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also read:

పవన్ కళ్యాణ్ తల్లిగా ఆరాధించే సురేఖ దగ్గర రెండు కోట్ల రూపాయలని అప్పు కింద తీసుకున్నారు. హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ దగ్గర నుండి 6 కోట్ల అప్పు, నిర్మాత నవీన్ ఎర్నేని మైత్రి మూవీ మేకర్స్ కి కలిపి తొమ్మిది కోట్లకు పైగా అప్పు ఉన్నారు. డివివీ ఎంటర్టైన్మెంట్ సంస్థకి పది లక్షల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ట్యాక్సుల రూపంలో 70 కోట్ల వరకు చెల్లించినట్లు చెప్పారు ఈ విధంగా ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ అప్పులు ఉండడాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading