Home » ఆ ఇద్దరు రెండు కళ్ళు.. మెగాస్టార్ మూడో కన్ను..!

ఆ ఇద్దరు రెండు కళ్ళు.. మెగాస్టార్ మూడో కన్ను..!

by Sravya
Ad

కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున మెగాస్టార్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ అంశంపై పరుచూరి పలుకులు ద్వారా పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ మొన్న జరిగిన పద్మా అవార్డు ఫంక్షన్ కి రమ్మని చిరంజీవి గారు కాల్ చేస్తే వెళ్లానని ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తర్వాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా ఆదర్శవంతంగా ఉండాలని ఆయన మాటలు నాకు బాగా నచ్చాయని అన్నారు.

Advertisement

Advertisement

చిరంజీవి ఎవరు సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నారని ఇది నిజంగా గొప్ప విషయమని.. ఒక్క చిరంజీవి గారు మాత్రమే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళందరూ ఆ రోజుల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చరిత్రని సృష్టించిన వారే అని అన్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అయితే నుదుటన మూడో కన్ను చిరంజీవి అని చాలా కాలం క్రితమే నేను చెప్పానని గుర్తు చేశారు. వెంకయ్య నాయుడు గారు ఇదే మాటని మొన్న వేదిక మీద అనడం నన్ను ఆనందాశ్చర్యాలకు గురి చేసిందని అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading