ప్రతిపరదా వెనకాల ఒక రహస్యం ఉన్నట్టు ప్రతి ఫ్లాప్ వెనకాల ఒక కారణం ఉంటుంది. అయితే ఆ కారణాలు విశ్లేషకులకు మాత్రమే తెలుస్తాయి. తాజాగా ప్రముఖరచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి, బాలకృష్ణ చేసిన సినిమాల ఫ్లాప్ ల వెనకాల ఉన్న కారణాలను విశ్లేషించి చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పాఠాలు అంటూ యూట్యూబ్ లో వీడియోల ద్వారా సినిమాల పై విశ్లేషణలు అంతే కాకుండా అప్ కమింగ్ సినిమా వాళ్లకు సూచనలు ఇస్తున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం పై కూడా పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. హీరోల బాడీ లాంగ్వేజ్ లకు తగ్గట్టుగా సినిమా కథలను రాసుకోవాలని చెప్పారు. బాడీ లాంగ్వేజ్ ను బట్టి కథ రాసుకున్నప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పారు. చిరంజీవి నక్సలైట్ పాత్ర పోషించడంలో కొన్ని పరిమితులకు లోబడాల్సి వచ్చిందని చెప్పారు.
Advertisement
అంతే కాకుండా చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్ కు సరిపోదని చెప్పినట్టు తెలిపారు. చిరంజీవి ఇమేజ్ మహావృక్షం లాంటిదని అలాంటి వ్యక్తి శాంతి వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని..ఈ విషయాన్ని తాను శంకర్ దాదా జిందాబాద్ సమయంలోనే ఆయనకు చెప్పానని అన్నారు. కానీ చిరంజీవి మీరు కాస్త రెబల్ అందుకే మీకు అలా అనిపిస్తుందండీ అంటూ నవ్వారని తెలిపారు.
శ్రీకాకుళాంద్ర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తే కూడా అలాగే జరిగిందని చెప్పారు. బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరిపిడుగు సినిమా విషయంలో కూడా ఇలానే జరిగిందని చెప్పారు. అల్లరిపిడుగు సినిమాలో తండ్రి పాత్రలో తననే చేయాలని కోరినట్టు తెలిపారు. అల్లరిపిడుగు సినిమాలో బాలయ్య ఎవరో కొత్త వ్యక్తిని చూసి బయపడితే ప్రేక్షకులకు నచ్చదని ఆ విషయం తాను ముందే చెప్పానని అన్నారు. కానీ దర్శకనిర్మాతలు అంగీకరించలేదని అన్నారు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిందని పరుచూరి చెప్పారు.
Also read :
నా కూతురేంటో నాకు తెలుసు…మా బావగారు ఉన్నంత వరకూ మాకేం పర్వాలేదు : నిహారిక తల్లి
తెలుగులో 24గంటల్లోనే అత్యధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరికల్ వీడియోలు..!