రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తాజాగా జనల ముందుకు వచ్చిన సినిమా విరాటపర్వం. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయిన కరోనా కారణంగా… అలాగే ఆ తర్వాత వచ్చిన మరికొన్ని సినిమాల కారణంగా ఆలస్యంగా జనల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై మొదట్లో మంచి అంచనాలు అనేవి ఉండేవి. కానీ మెళ్లిగా దీనిపై ఆసక్తి తగ్గిపోయింది. కానీ ఇందులో సాయి పల్లవి ఉండటంతో ఆమె వల్ల అయిన సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
Advertisement
ఈ సినిమా జనల ముందుకు వచ్చిన తర్వాత దీనికి నెగెటివ్ టాక్ అనేది వచ్చింది. అయితే సినిమాలపైన తన రివ్యూ అనేది చెప్పే పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో కొని మార్పులు చేస్తే సూపర్ హిట్ అయ్యేది అని అన్నారు. అయితే ఆయన మాట్లాడుతూ.. విరాట పర్వం అనేది సాయిపల్లవి మోనో యాక్షన్ సినిమా. నేను ఇప్పటికే ఎన్నో సినిమాలు రాసాను… చేశాను. కానీ నేను ఈ సినిమ చూస్తున్న సమయంలో సాయి పల్లవిని అలా చూస్తూ ఉండిపోయాను అని చెప్పారు. అలాగే ఈ సినిమాకు సాయి పల్లవికి ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నారు,
Advertisement
అయితే ఈ సినిమా ప్లాప్ కావడానికి ముఖ్య కారణం సరైన సమయంలో విడుదల కాకపోవడం అని చెప్పారు. ఇప్పుడు అందరూ కమర్షియల్ సినిమాలకే అలవాటు పడ్డారు అని చెప్పారు. అదే విధంగా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే కథ, కథనం కూడా బాగున్నాయి. కానీ క్లైమాక్స్ ను మారిస్తే సినిమా రిజల్ట్ కూడా మారేది అన్నారు. ఇక్కడే ఇందులో సినిమాటిక్ ను వాడుకొని సావి రవన్న వెన్నెలకు పెళ్లి చేసి.. చివరకు వారిని కలిపితే సినిమా ఫలితం మొత్తం మారిపోయేది అన్నారు.
ఇవి కూడా చదవండి :