Home » ఇండియా ఐసీసీ టైటిల్స్ ఎందుకు గెలవడం లేదో తెలుసా..?

ఇండియా ఐసీసీ టైటిల్స్ ఎందుకు గెలవడం లేదో తెలుసా..?

by Azhar
Ad

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. 2013 లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత నుండి ఒక్క ఐసీసీ కప్పు కూడా మళ్ళీ మనకు రాలేదు. ప్రతి టోర్నీలో టైటిల్ ఫెవరెట్ గా బరిలో దిగే భారత జట్టు సెమీస్ లేదా ఫైనల్స్ వరకు వెళ్తుంది. అక్కడి నుండి తిరిగి వస్తుంది. ధోని కెప్టెన్ గా తప్పుకున్న తరత వచ్చిన కోహ్లీ కెప్టెన్సీలో ఇది బాగా జరిగింది.

Advertisement

ఇక ఇలా భారత జట్టు ఐసీసీ టైటిల్స్ అనేవి గెలవకపోవడానికి కారణాలను భారత మాజీ ఆటగాడు పార్థీవ్ పటేల్ చెప్పాడు. అయితే ఏ టోర్నీలో అయిన జట్టు అనుసరించే ప్లాన్ అనేది చాల ముఖ్యం అని పేర్కొన్నాడు. ఇక అందులో లోపలవల్లే టీం ఇండియా ఓడిపోయింది అని పేర్కొన్నాడు. 2017 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో అనాలోచితంగా బ్యాటింగ్ పిచ్ పైన.. టాస్ గెలిచి టీం ఇండియా బౌలింగ్ తీసుకోవడం తప్పు.

Advertisement

అలాగే 2019 ప్రపంచ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ధోనిని 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించకుండా కూర్చోబెట్టి.. 7వ స్థానంలో పంపించడం కరెక్ట్ కాదు. ధోనిని కూర్చోబెడితే టీం ఇండియా ఎలా గెలుస్తుంది అని పార్థీవ్ పటేల్ ప్రశ్నించాడు. ఇక గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో జట్టు ఎంపిక విషయంలోనే తప్పు చేసారు. స్పిన్నర్ చాహల్ ను కాకుండా ఇద్దరు యువ స్పిన్నర్స్ ను సెలక్ట్ చేయడంతో భారీ మూల్యం చెలించుకున్నారు అని పార్థీవ్ పటేల్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ టోర్నీ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

వారు అంత గొప్పగా ఏం చేసారు…?

Visitors Are Also Reading