Home » Parenting Tips : పిల్లలు మీ మాట వినడం లేదా..? అయితే ఈ ఆరు చిట్కాలతో వారిని మీ దారిలో తెచ్చుకోండి..!

Parenting Tips : పిల్లలు మీ మాట వినడం లేదా..? అయితే ఈ ఆరు చిట్కాలతో వారిని మీ దారిలో తెచ్చుకోండి..!

by Mounika
Ad

ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ వారు చెప్పిన మాట వినాలని ఆశపడుతారు. తమ బిడ్డపై వారు ఎక్కువ శ్రద్ధ చూపించినప్పటికీ ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులకు ఎక్కువగా నిరాశ ఎదురవుతుంది. కొన్నిసార్లు వారు తమ అమ్మ లేదా నాన్న చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు ఎంత మొండిగా ప్రవర్తించిన, వారిని సక్రమమైన మార్గంలో జీవితాన్ని క్రమశిక్షణలో నడిపించడం అనేది తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రధానమైన సవాల్.

Advertisement

పిల్లలలో ఇలాంటి ధోరణి కనిపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే.. తల్లిదండ్రులు ఏదైనా మాట చెప్పినప్పుడు పిల్లలు వారి మాట పట్టించుకోకపోవడానికి  మొదటి కారణం వారు వేరే పనిపై నిమగ్నలై ఉండడం. అటువంటి పరిస్థితిలో ఈ 6 చిట్కాల సహాయంతో మీ పిల్లలు ప్రతి విషయంలో మీ మాట వినేలా చేసుకోవచ్చు. ఎప్పుడైతే పిల్లలు మీ మాట వినకపోతే ఈ 6 చిట్కాలను వారిపై అమలు చేయండి.

#1.నేరుగా చెప్పండి:

మీ పిల్లలు మీ మాట విననప్పుడు వారు ముందుగా మీరు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అటువంటి పరిస్థితిలో, మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో చిన్న పదాలలో పిల్లలకు అర్థమైన రీతిలో ఎక్కువసార్లు చెబుతూ ఉండండి. ఈ విధంగా చేయటం ద్వారా వారు మీ మాటలను అర్థం చేసుకునే స్వభావం ఏర్పడుతుంది.

#2.హెచ్చరిక :

పిల్లలు మీ మాటలను వినకుండా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తే ఖచ్చితంగా వారికి హెచ్చరిక ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారు తాము చేసే పనిలో ఎలాంటి తప్పు ఉందో తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు.

#3. జవాబు చెప్పడం :

Advertisement

మీరు పిల్లలని ఏదైనా చేయమని అడిగినప్పుడు వారు “సరే” అని చెప్పాలి. కేవలం మీరు వారికి డైరక్షన్స్ మాత్రమే ఇస్తూ ఉంటే, వారు మీరు చెప్పిన పనిపై అంతగా శ్రద్ధ వహించకపోవచ్చు. మీరు ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు ఆ పని చేస్తావా లేదా అనే విషయాన్ని వారిని సున్నితంగా అడిగి తెలుసుకోవాలి.

#4. మీరు కూడా విననని చెప్పండి :

మీ బిడ్డ మీ మాట విననని సమయంలో నువ్వు అలా చేస్తే నేను కూడా నీ మాట వినను అని వారికి అర్థమయ్యేలా ఉదాహరణలు చూపించండి. అప్పుడు పిల్లలు మీ మాటని అర్థం చేసుకొని మీ మాటలకు ప్రాముఖ్యతను ఇవ్వటం ప్రారంభిస్తారు.

#5. ఆలోచించడానికి సమయాన్ని ఇవ్వండి:

చిన్నపిల్లలకు పెద్దవారిలా ఆలోచన జ్ఞానం ఉండదు. వారు ఏదైనా విషయం నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రులు అనేకసార్లు అర్థమయ్యేలా వారికి చెబుతూ ఉండాలి. ఉదాహరణకు వారు హోంవర్క్ చేసే విషయంలో వారికి అంత అనుభవం ఉండదు. అందువలన వారికి పజిల్ గేమ్స్ లాంటివి నేర్పించి ఆలోచన శక్తిని పెంచే విధంగా చేయాలి.

#6.నిందించవద్దు:

చిన్నపిల్లలకు ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకునే అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. వారు ఏదైనా పని చేయలేనప్పుడు వారిని నిందించడం అసలు చేయకూడదు. వారికి విషయం అర్థమయ్యే వరకు ఎంతో ఓర్పుతో తల్లిదండ్రులు నేర్పించాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

బ్లూ టీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. మీ రోజువారీ డైట్ లో తప్పకుండా తీసుకుంటారు..!

Health care : ఈ 7 వ్యాధులు మనిషి జీవితానికి సైలెంట్ కిల్లర్స్..! అవేంటో తెలుసుకొని ముందుగా జాగ్రత్త వహించండి..!

Health care : పీరియడ్స్ బ్లోటింగ్ నుండి ఉపశమనం పొందే మార్గాలు..!

Visitors Are Also Reading