Home » ప్రపంచ కప్ ముందు బీసీసీఐ పిచ్చి ప్రయోగం.. ఓపెనర్ గా పంత్…!

ప్రపంచ కప్ ముందు బీసీసీఐ పిచ్చి ప్రయోగం.. ఓపెనర్ గా పంత్…!

by Azhar
Ad
గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేకపోయిన టీమ్ ఇండియా ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలను రచిస్తోంది. ఆ టోర్నీని దృష్టిలో పెట్టుకొనే జట్టు ఎంపిక, మార్పులు అనేది చేస్తుంది. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ కు జట్టును కూడా అదే ఉద్దేశ్యంలో ఎంపిక చేసింది. అయితే అందులో కొన్ని బెడిసి కొట్టాయి కూడా. అయిన కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ అటువంటి బెడిసికొట్టే పిచ్చి ప్రయోగం ఒకటి చేయాలనీ బీసీసీఐ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
అయితే భారత జట్టు ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ ఈ సఫారీల సిరీస్ కంటే ముందు గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఇప్పటికి అతను కోలుకోలేదు. ఇందుకు చికిత్స తీసుకోవడానికే ఈరోజే రాహుల్ జర్మనీ వెళ్ళాడు. అయితే అతను ఎప్పటికి కోలుకుంటాడు అనేది తెలియడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇండియా ఆ తర్వాత 3 టీ20 మ్యాచ్ లు కూడా ఆడనుంది. కాబట్టి ఈ సిరీస్ కు రాహుల్ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఓపెనర్ గా పంపించాలని బీసీసీఐ అనుకుంటుంది.
అయితే పంత్ ప్రస్తుతం బ్యాటింగ్ ఆర్డర్ లో 5 లేదా 6 స్థానంలో వస్తున్నాడు. కానీ ఈ ఐపీఎల్ లో అలాగ సౌథ ఆఫ్రికా సిరీస్ లో అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతడిని జట్టు నుండి తప్పించాలని అనే సిమండ్ వస్తుంటే.. బీసీసీఐ మాత్రం అతనితో ఓపెనింగ్ చేయించాలని చూస్తుంది. రోహిత్ తో కలిసి పంత్ ఓపెనర్ గా రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా పక్కాగా సెట్ అవుతుంది అని.. మిడిల్ ఆర్డర్ లో రాణించలేకపోతున్న అతను ఓపెనర్ గా రాణిస్తాడు అని బీసీసీఐ సెలక్టర్లు అలాగే కోచ్ ద్రావిడ్ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Visitors Are Also Reading