Home » సన్ రైజర్స్ ఆటగాళ్ల అరంగేట్రంపై కెప్టెన్ పాండ్య హింట్..!

సన్ రైజర్స్ ఆటగాళ్ల అరంగేట్రంపై కెప్టెన్ పాండ్య హింట్..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత ఈ మధ్యే సౌత్ ఆఫ్రికాతో టీ20 లో పాల్గొంది టీం ఇండియా. అయితే ఈ సిరీస్ జరుగుతుండగానే సీనియర్ ఆటగాళ్లతో కూడా ఓ భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. ఇక ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ లో రాణించినా యువ ఆటగాళ్లతో పాటుగా.. కొందరు సీనియర్ ఆటగాళ్లతో మరో భారత జట్టు టీ20 సిరీస్ లో పాల్గొనడానికి ఐర్లాండ్ కు వెళ్ళింది. అయితే ఈ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వ్యవరించనున్నాడు.

Advertisement

ఐపీఎల్ లో ఈ ఏడాదే వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్స్ గా నిలిపిన పాండ్యపైన నమ్మకంతో బీసీసీఐ అతని చేతిలో కెప్టెన్సీ ఉంచింది. ఇక ఇప్పటికే ఐర్లాండ్ చేరుకుంది టీం ఇండియా. ఇక తాజాగా అక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన కెప్టెన్ పాండ్య మాట్లాడుతూ.. ఇద్దరు సన్ రైజర్స్ ఆటగాళ్ల అరంగేట్రంపై హింట్ ఇచ్చాడు. ” మేము ఈ సిరీస్ లో ఇద్దరు ఆటగాళ్ల రంగేట్రం చేయబోతున్నం. అయితే ఇది మేము చేసే ప్రయోగం మాత్రం కాదు. ఇదే మా అత్యుత్తమ జట్టు అని పేర్కొన్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఆటగాళ్లు రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ ఈ పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే.

Advertisement

అయితే… ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగంలో వన్ డౌన్ ఆటగాడిగా… రాహుల్ త్రిపాఠి.. అలాగే బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఉమ్రాన్ మాలిక్ గత సౌత్ ఆఫ్రికా సిరీస్ లోనే టీం ఇండియాలోకి వచ్చాడు. కానీ అప్పటి కెప్టెన్ పంత్.. మ్యాచ్ ఓడిపోతున్న జట్టులో మార్పులు చేయలేదు. అందుకే మాలిక్ కు అవకాశం అనేది రాలేదు. కానీ ఇప్పుడు పాండ్య మాలిక్ కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో గంటకు 150 కీ.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే మాలిక్ టీం ఇండియా తరపున ఆడటం కోసం చాలా మంచి ఎదురు చూస్తున్నాడు అనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఆగ్రహానికి గురైన అభిమాని.. వీడియో వైరల్..!

ఇండియా , పాకిస్థాన్ క్రికెట్ లో ఉన్న తేడా ఏంటో చెప్పిన ప్లేయర్…!

Visitors Are Also Reading