కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA కు పాకిస్తానీమాజి క్రికెటర్ మద్దతు పలికాడు. CAA నోటిఫికేషన్ పై స్పందించాడు పాకిస్తానీ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ రెఫ్యూజీలకు భారత పౌరసత్వం పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాకిస్తానీ హిందువులు ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Advertisement
పాకిస్తానీ హిందువుగా ఉన్న డానిష్ కనిరియా ఈ వాఖ్యలు చేయడం వెనుక పెద్ద విషయమే ఉంది. ఇండియన్ గుజరాతి ఫ్యామిలీకి చెందిన కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం సూరత్ వదిలి పాకిస్తాన్ కరాచీలో స్థిరపడ్డారు. గతంలో డానిష్ కనిరియా బంధువు అనిల్ దల్పట్ అనే వ్యక్తి సైతం పాకిస్తాన్ టెస్ట్ వికెట్ కీపర్ గా పనిచేశాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఉన్న ఏకైక హిందువుగా డానిష్ కనెరియా కు గుర్తింపు ఉంది.. తాను హిందువుగానే పుట్టాను హిందువుగానే చనిపోతాను అంటూ గతంలోనూ డానిష్ కనేరియ వాఖ్యలు చేశాడు. తను సనాతన ధర్మాన్ని అనుసరిస్తానని గతంలో ఒక ఛానల్ కి చిన్న ఇంటర్వ్యూలో కనిరియా స్పష్టం చేశాడు.
Advertisement
ప్రస్తుతం తాను పాకిస్తాన్ లో నివసిస్తున్నప్పటికీ.. తన మూలాలు మాత్రం ఎప్పటికీ సనాతన ధర్మమేనని డానీష్ కనేరియా తెలిపాడు. పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. భారత ప్రభుత్వం CAA నిర్ణయంతో పాకిస్తానీ హిందువులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చని సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ అక్తర్ తనను మతం పేరుతో దూషించాడని సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో డానిష్ కనిరియాపై నిషేధం విధించారు. CAA కు మద్దతు ప్రకటించిన డానిష్ కనేరియ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు.
Also Read : సచిన్ కొడుకు దెబ్బకు క్రీజులోనే కుప్పకూలిన టీమిండియా క్రికెటర్..!