Home » Pubg love story : పబ్ జీ గేమ్ లో సహ ఆటగాడితో ప్రేమలో పడింది…! వీరి ప్రేమ కథలో ఎన్ని మలుపులు ఉన్నాయంటే..?

Pubg love story : పబ్ జీ గేమ్ లో సహ ఆటగాడితో ప్రేమలో పడింది…! వీరి ప్రేమ కథలో ఎన్ని మలుపులు ఉన్నాయంటే..?

by Mounika
Ad

Pubg love story : ప్రేమ అనేది ఒక మధురమైన కావ్యం లాంటిది. అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎవరో చెప్పలేరు.. కొన్ని ప్రేమకథలు వింటుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ మరికొన్ని ప్రేమకథలు వింటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి విచిత్ర ప్రేమ కథ గురించే మనం చెప్పుకోబోతున్నాం. మన సమాజంలో వివాహ బంధానికి కొన్ని హద్దులు ఉన్నాయి. కానీ ఈ తరంలో కొంతమంది ఆ హద్దులను దాటి ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. వివాహ బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Advertisement

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ పాకిస్థానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ లో అక్రమంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇండియాకు చెందిన సచిన్ మీనా, పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ లకు పబ్ జీ గేమ్ ద్వారా ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ ముదిరి పాకాన పడటంతో ఈ ఏడాది మార్చిలో ఆమె కరాచీ నుంచి దుబాయ్, ఆ తరువాత అక్కడి నుంచి నేపాల్ చేరుకుంది. మూడేళ్ల పరిచయంలో నేపాల్లో తొలిసారి ప్రత్యక్షంగా కలుసుకున్న వారిద్దరూ అక్కడే వివాహం కూడా చేసుకున్నారు. ఇక ఆ తరువాత ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. అక్కడ నుంచి అసలు కథ మొదలయ్యింది. సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్ ప్రవేశించేందుకు పెద్ద ప్రయత్నం చేసిందట.

Advertisement

నేపాల్ నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం సీమా తన భర్తతో గొడవ పడడం స్టార్ట్ చేసింది. ఆమె ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఓ ప్లాట్ ని 12 లక్షల పాకిస్థానీ రూపాయలకు విక్రయించి ఆమె ప్రయాణానికి కావాల్సిన డబ్బు సమకూర్చుకుంది. సీమా హైదర్ కు ఉన్న ఏడేళ్లలోపు తన నలుగురు పిల్లలకు విమాన టిక్కెట్లు, నేపాల్ వీసా ఏర్పాటు చేసుకుంది. ఇక మేలో దుబాయ్ మీదుగా నేపాల్ చేరుకుని అక్కడి పర్యాటక నగరమైన పోఖారాలో కొంతకాలం గడిపింది. అక్కడి నుంచి ఖార్మండూకు చేరుకుని, మే 13న దిల్లీ నుంచి బస్సులో బయలుదేరి గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అక్కడే సచిన్ ఆమెను అద్దె గృహంలో ఉంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ఇటీవల ఈ విషయం పోలీసులు వారిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. సీమాపై అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్లు అభియోగాలు మోపగా.. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ పై కేసు నమోదు చేశారు పోలీస్ అధికారులు. అయితే ఈ ఇద్దరికీ ఇటీవల కోర్టు బెయిల్
మంజూరు చేసింది. నా భర్త సచిన్ మీనా భారతీయుడు.. నేను కూడా నన్ను నేను భారతీయురాలిగానే భావిస్తున్నాను. ఇక ఆమె కూడా అధికారికంగా భారత్లోనే ఉండిపోయేందుకు అధికారులను సంప్రదిస్తానని పాకిస్థాన్ తిరిగి వెళ్లడం తనకు ఇష్టం లేదని, అక్కడ తన ప్రాణాహాని ఉందని ఆమె ఓ వార్తాసంస్థతో వెల్లడించింది. మరోవైపు.. ఆమె భర్త మాత్రం తన భార్యను తిరిగి పాకిస్థాన్ పంపించాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాడు.

Visitors Are Also Reading