పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ ఓ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన హఫీజ్ తాజాగా వన్డేలు, టీ-20లు నుంచి కూడా తప్పుకున్నాడు. దాదాపు 18 ఏండ్ల కాలం పాటు పాక్ క్రికెట్‌కు సేవలందించాడు. 2003లో జింబాబ్వే పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అతడు ఆరంగ్రేటం చేశాడు. అతడు చివరి మ్యాచ్ టీ-20 ప్రపంచకప్-2021 సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించించి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే పాక్ తరుపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో పాటు, 12000 పైగా పరుగులు చేసాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం హాఫీజ్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కరేబియన్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, దుబాయ్ టీ-10 లీగ్‌లో భాగంగా ఉన్నాడు.