వచ్చే సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగే ఆసియా కప్ టోర్నీపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. నిర్వహించాలని పిసిబి ప్రెసిడెంట్ చెబుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ లో అడుగుపెట్టేదే లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు. అవసరం అయితే తటస్థ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో ఈ టోర్నీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా, ఆసియాకప్ ను తమ దేశం నుంచి శ్రీలంకకు తరలించారు అన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
READ ALSO : DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!
Advertisement
భారత్ తన మ్యాచ్లను యూఏఈ లో ఆడాలని పాక్ చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాలు తిరస్కరించాయి. దీంతో ఈ కప్ ను ఎసిసి… పాక్ నుంచి తరలించింది. ఈ విషయంపై మంగళవారం దుబాయ్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులతో సమావేశమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజామ్ సెథి… కప్ ను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆసియాకప్ నిర్వహణపై తమ ప్రతిపాదనలను ఎసిసి ముందు ఉంచాం.
Advertisement
READ ALSO : Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?
ఒకవేళ సభ్య దేశాలు అంగీకరించకపోతే 2018, 2022లో మాదిరి యూఏఈలో టోర్నీ నిర్వహించాలి. సెప్టెంబర్ లో యూఏఈలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్థమే లేదు. 2020లో ఐపిఎల్ టోర్నీ సెప్టెంబర్-నవంబర్ లో ఇదే వేదికలో జరిగిన విషయం గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరిలో జరిగిన ఎసిసి సమావేశంలో శ్రీలంక, ఆసియా కప్ ఆతిధ్య ప్రతిపాదనను బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తిరస్కరించాయి. కానీ ఉన్నట్టుండి లంకకు ఆతిధ్య హక్కులు దక్కడానికి ఆ దేశాలు ఎలా అంగీకరిస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది” అని పిసిబి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆసియా కప్ ను శ్రీలంక తరలించడంలో భారత్ వెనుక నుంచి సహకారం అందించిందని పిసిబి భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2న ఆసియా కప్ ఆరంభం కావాల్సి ఉంది.
Read also : సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్..కేబినెట్ హోదాతో కీలక పదవి!!