Home » అది డెడ్ బాల్ అని వాదిస్తున్న పాక్..!

అది డెడ్ బాల్ అని వాదిస్తున్న పాక్..!

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్.. ఇప్పటివరకు టీ20 క్రికెట్ లోనే అత్యంత ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ అనేది అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి బంతికి ఇండియా విజయం సాధించింది. కానీ భారత విజయాన్ని ఓర్చుకోలేకపోతున్న పాకిస్థాన్ మరో కొత్త వివాదానికి తెరలేపింది. కోహ్లీ ఔట్ అయిన బంతిని డెడ్ బాల్ గా పరిగణించాలి అని బార్ ఆజాం పేర్కొన్నాడు.
అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్లో పాక్ బౌలర్ నవాజ్ వేసిన మూడో బంతి అనేది నో బాల్ గా పడింది. ఆ తర్వాత వేయాల్సిన ఫ్రీ హిట్ బాల్ అనేది వైడ్ అయ్యింది. అందువల్ల ఆ ఫ్రీ హిట్ అనేది కొనసాగుతున్న వేసిన తర్వాతి బంతికి విరాట్ కోహ్లీ క్లిన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఫ్రీ హిట్ బంతికి ఔట్ అయిన అది నాట్ ఔట్. అయితే ఈ బంతి వికెట్స్ కు తాకి బౌదరి వైపు వెళ్లడం… కోహ్లీ ట్రాన్స్ తీసాడు.
ఈ బంతికి ఏకంగా ముడు రన్స్ తీసాడు. అందువల్ల మ్యాచ్ మనవైపు వచ్చింది. ఇక ఇక్కడే మన బ్యాటర్లు రన్స్ తీయడంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం నిరసన అనేది వ్యక్తం చేసాడు. అయితే ఫ్రీ హిట్ బాల్ లో బ్యాటర్ ఔట్ అయితే దానిని డెడ్ బాల్ గా డిసైడ్ చేయాలా వద్దా అనే హక్కు యంపిర్ కు ఉంటుంది. కాబట్టి అంపైర్ దీనిని డెడ్ బాల్ గా ఇవ్వలేదు.

Advertisement

Visitors Are Also Reading