ప్రపంచకప్ 2011 మొహాలీలోని పీసీఏ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ తన సత్తాను ప్రపంచం మొత్తానికి చూపించాడు. మొహలీలో భారత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు వహాబ్ రియాజ్. అతని గురించి ప్రస్తుతం మాత్రం పెద్ద చర్చనే జరుగుతోంది. పాకిస్తాన్ జట్టు తరుపున ఆకట్టుకున్న ఈ బౌలర్ ప్రస్తుతం జట్టులో లేడు. అయితే వాహబ్ రియాజ్.. వీరేంద్రసెహ్వాగ్, ఎం.ఎస్.ధోని, విరాట్‌కోహ్లీ వంటి అనుభవజ్క్షలను ఒకేవిధంగా ఔట్ చేసాడు. ప్రపంచకప్‌లో సందడి చేసి అదే పాక్ బౌలర్ పాకిస్తాన్ రోడ్డుపై వీధివ్యాపారిగా మారి పప్పులు అమ్ముతూ కనిపించాడు.
Advertisement
Advertisement
మీరు కంగారు పడకండి..పాకిస్తాన్ క్రికెట్ వాహబ్ రియాజ్ వాస్తవానికి పప్పులు ఏమి అమ్మడం లేదు. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే..? వహాబ్ రియాజ్ తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో పప్పు అమ్ముతున్నట్టు కనిపించాడు. వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. నాకు నా చిన్ననాటి రోజులు గుర్తున్నాయి. సరదాగా గడిచాయి అంటూ రాసుకొచ్చాడు. వహాబ్ రియాజ్ బిగ్ టోర్నమెంట్ బౌలర్. అయినా పాక్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈలెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ పెద్ద టోర్నమెంట్‌లో ఎప్పుడూ మెరుస్తూనే ఉన్నాడు. వాహబ్ రియాజ్ 2011 ప్రపంచకప్‌లో ఆడిన 5 మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 5 పరుగుల కంటే తక్కువగా ఉన్నది. భారత్ పై మాత్రమే తను తీసిన వికెట్లలో 5 ఉన్నాయి.
2015 ప్రపంచకప్‌లో రియాజ్ అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్‌కు పేరు పొందాడు. ఆస్ట్రేలియాపై తన అధ్భుతమైన బౌన్సర్‌తో బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. షేన్ వాట్సన్ ఈ పాక్ బౌలర్ బంతుల్లో ఆడటం అసాధ్యంగా మారింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తరుపున అత్యుత్తమ ప్రదర్శనతో 16 వికెట్లు తీసాడు. డిసెంబర్ 2020 నుండి పాక్ జట్టుకు దూరం అయ్యాడు. 36 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ 27 టెస్ట్‌లో 83 వికెట్లు తీశాడు. 91 వన్డేల్లో 120 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఈ ఫాస్ట్ బౌలర్ 36 టీ-20లలో 34 వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన చేశాడు.