ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టైల్స్ ఉంటున్నాయి టైల్స్ ని అందరూ వేయించుకుంటున్నారు. ఇదివరకు సాధారణ గచ్చు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ రంగురంగుల టైల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. టైల్స్ వేసిన తర్వాత పెయింట్లు వేస్తే పెయింట్ మరకలు పడిపోతాయి. అటువంటి మరకల్ని వదిలించుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ పెయింట్ మరకల్ని టైల్స్ పై నుండి తొలగించడానికి ఈ సింపుల్ చిట్కా బాగా వర్క్ అవుట్ అవుతుంది. పొరపాటున కనుక టైల్స్ మీద పెయింట్ మరకలు పడినట్లు అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కంగారు పడక్కర్లేదు.
Advertisement
Advertisement
పెయింట్ మరకలు పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మీరు క్లీన్ చేసేయవచ్చు. కొంచెం వెనిగర్ ని మీరు పెయింట్ మరకలు మీద వేసి క్లీన్ చేసుకోవచ్చు. పెయింట్ మరక మీద ముందు కొంచెం వెనిగర్ వెయ్యండి ఏదైనా నూనెను వేడి చేసి దాని మీద వేసి మైక్రో ఫైబర్ క్లాత్ తో నేల మీద పెయింట్ మరక మీద రుద్దండి. తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే క్లీన్ అయిపోతుంది పెయింట్ మరకలు మీద హార్పిక్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి తర్వాత స్క్రబ్ చేస్తే కూడా పెయింట్ మరకలు ఈజీగా పోతాయి. కానీ హార్పిక్ ని ఎక్కువసేపు వదిలేయొద్దు టైల్ రంగు మారే అవకాశం ఉంది.
Also read:
- ఉడకబెట్టిన శెనగలు తీసుకుంటే.. ఈ సమస్యలేమీ వుండవు…!
- చాణక్య నీతి: ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే… ఇవి కచ్చితంగా తెలుసుకోండి…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి