పద్మనాభం గురించి అందరికీ సుపరిచితమే. ఆయన కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటుడుగా ఎన్ని ఏళ్ళు తన హాస్యాన్ని ప్రేక్షకులకు పంచారు. తర్వాత దర్శకుడుగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎవరు చూడని హైట్స్ చూసేసి అంతే వేగంగా ఎవరో చూడని లోతుకు వెళ్ళిపోయారు. పద్మనాభం స్టైల్ చాలా మందికి విభిన్నంగా ఉంటుంది ఎన్నో ప్రయోగాలు కూడా ఆయన చేశారు. కొన్ని కారణాల వలన చితికిపోయారు చేతిలో డబ్బు ఉంటే సినిమాలు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇల్లు ఒళ్ళు తాకెట్టు పెట్టుకుని సినిమాలు కూడా పద్మనాభం సినిమాలు తీశారు.
Advertisement
Also read:
ఒక సినిమా సక్సెస్ అయింది అనుకునే లోగా ఇంకో సినిమా పరాజయాన్ని అందుకునేది మళ్లీ ఒక సినిమా హిట్ అయితే ఇంకొకటి ఫట్ అయ్యేది. అందుకని ఆయన చివరి వరకు ఏమీ సంపాదించలేదు. ఉన్నది పోగొట్టుకున్నారు. చివరికి ఒక రూపాయి కూడా లేకుండా చనిపోయారు. పద్మనాభం మూవీస్ కోసం ఏమైనా చేసేవారు. ఎంతలా అంటే ఆయన తీసిన నాలుగు సూపర్ హిట్ మూవీస్ ని ఒక సినిమా విడుదల చేయడం కోసం ఒక వ్యక్తి దగ్గర అరవై వేలు కోసం తాకెట్టు పెట్టుకున్నారు. ఆరు నెలల్లో డబ్బులు కట్టి అవి విడిపించుకుంటాను లేకపోతే వాటి రైట్స్ అమ్మేసుకోమని పైన వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలని చెప్పారట.
Advertisement
Also read:
Also read:
ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో మూడు లక్షల కి అమ్ముకుని పద్మనాభం కి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం 60 వేల డబ్బు కోసం మూడు లక్షల రూపాయలని ఆ వ్యక్తి సంపాదించుకున్నాడు. నెగిటివ్ రైట్స్ తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చాలా ఏళ్ల పాటు కోర్టులో కేసు జరిగింది చివరికి డబ్బు ఇచ్చిన వ్యక్తి కూడా చనిపోయాడు అతని కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకుని వాటికి సంబంధించిన రైట్స్ పద్మనాభనికి ఇచ్చారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!