Home » కనీస అర్హత లేని చిత్రాలు ఆస్కార్ కు పోతున్నాయి.. AR రెహమాన్ కామెంట్స్ వైరల్ ..!!

కనీస అర్హత లేని చిత్రాలు ఆస్కార్ కు పోతున్నాయి.. AR రెహమాన్ కామెంట్స్ వైరల్ ..!!

by Sravanthi
Ad

తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆస్కార్ అవార్డు గురించి చర్చ సాగుతోంది.. అయితే ఆస్కార్ అవార్డుపై మ్యూజిక్ దేవుడు ఏఆర్ రెహమాన్ సంచలమైన వ్యాఖ్యలు చేశారు. అర్హత లేనటువంటి సినిమాలను ఆస్కార్కు పంపిస్తున్నారని బాధపడ్డారు. భారతదేశం నుంచి రెండు ఆస్కార్లను ఒకేసారి అందుకొని చరిత్ర సృష్టించాడు ఏఆర్ రెహమాన్. 2009లో స్లామ్ డాగ్ మిలియన్ సినిమాకు గాను, గుల్జర్ రసూల్ పూకుట్టి ఒకేసారి అందుకున్నాయి.

also read:చిరంజీవి, సుధాకర్ దొంగతనం చేసి దొరికిపోయారా..?

Advertisement

ఇక దాని తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డునందుకుంది. అసలు ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం ఏంటో పెద్ద కథే ఉందని చెప్పవచ్చు. ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా ఆదరణ పొందింది. అంతేకాకుండా ఆస్కార్ కు వెళ్లి అర్హత ఉండడంతో భారత ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఆస్కార్ కు పంపిస్తుందని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ కాదని గుజరాతి చిత్రమైన లాస్ట్ ఫిలిం షోని ఆస్కార్ నామినేషన్ కు పంపారు. కానీ ఆ చిత్రం ఆఖరిబరిలో స్థానం దక్కించుకోలేక వెనక్కి వచ్చింది.

Advertisement

also read:ఒక్క 500నోటు కుటుంబాన్ని నాశనం చేసింది.. ఎంత అమానుషమంటే..?

కానీ త్రిబుల్ ఆర్ టీం మాత్రం వెనకడుగు వేయకుండా సొంతంగా ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేటై రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆస్కార్ తీసుకునే వరకు వెన్ను తిరగలేదు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించారు. మన చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి వస్తున్నాయి. అర్హత లేనటువంటి చిత్రాలను ఆస్కారికి పంపిస్తున్నారని అనిపిస్తోందని బాధపడ్డారు. ఇలా జరుగుతుంటే చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

also read:ఇద్దరమ్మాయిలు గాడ ప్రేమికులు..అంతలో అబ్బాయి ఎంట్రీ.. ఇద్దరితో ఆ పనే..!!

Visitors Are Also Reading