తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం తిండి కూడా దొరకక కష్టాలు అనుభవించారు. అవకాశాల కోసం నానాయాతన పడ్డారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకొని అందులో హరి ప్రసాద్,సుధాకర్, చిరంజీవి కలిసి ఉండేవారు. ఎక్కడైనా ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్లేవారు. ఆ టైంలో వీరికి ఒక పూట తినడానికి కూడా భోజనం దొరికేది కాదు. పస్తులు కూడా ఉండేవారట.
Advertisement
also read:Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?
అలా ఒక రోజు రూమ్ లో కర్రీ చేసుకుందామని అనుకున్న సమయంలో కూరగాయలు తెద్దామంటే డబ్బులు లేవు. కర్రీ చేసుకోవాలి. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో పక్కింట్లో ఒక ములక్కాడ చెట్టు కనబడింది. మెల్లిగా గోడ ఎక్కి ములక్కాడ చెట్టు దగ్గరికి వెళ్లి ములక్కాడలను దొంగిలించి కర్రీ వండుకున్నారు. కానీ ఆ ఇంటి వాళ్లు ఈ విషయం తెలుసుకొని నేరుగా వీరు తినే సమయానికి రూమ్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి , వీరు వండుకున్న కర్రీని కూడా పట్టుకుని వెళ్లారట.
Advertisement
also read:కీరవాణి ఆరోజే రిటైర్ అవుతా అన్నాడు కానీ..!
ఇలా కడుపు నింపుకోవడం కోసం దొంగతనం కూడా చేసి, అవమానాల పాలైన వారు ఎంతో కసిగా ప్రయత్నం చేసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్లుగా ఎదిగారు. ఇందులో చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా మారి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు . సుధాకర్ కూడా తనదైన కామెడీతో అదరగొట్టి తమిళ్, తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించాడు.
Advertisement
also read:‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!